భాయ్.. ఓ బాధితుడు! (సల్మాన్ 'భారత్' మిని రివ్యూ)

సల్మాన్‌ఖాన్ కొత్త సినిమా ‘భారత్’. ఈ సినిమా 2019 ఈద్ సందర్భంగా  ఈ రోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. 

Salman Khan's Bharat movie mini review

 

సల్మాన్‌ఖాన్ కొత్త సినిమా ‘భారత్’. ఈ సినిమా 2019 ఈద్ సందర్భంగా  ఈ రోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. 4000కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే వస్తోంది. ‘ఓడ్‌ టు మై ఫాదర్’ అనే కొరియన్‌ సినిమాకు కు రీమేక్‌గా వచ్చిందీ ఈ చిత్రం. ఈ రీమేక్ సినిమాకు మన నేటివిటిని అద్ది దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ బాగానే తెరకెక్కించారు.  అయితే ఇది సల్మాన్ అభిమానులను అలరిస్తుందా..లేక కేవలం ఓ వర్గానికే నచ్చుతుందా..ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సల్మాన్ కు రిలీఫ్ ఇస్తుందా అనేది చూద్దాం.

కథేంటంటే..?

1947 లో ఇండియా...పాకిస్దాన్ విడిపోయినప్పుడు భరత్ (సల్మాన్) సోదరి నుంచి  తప్పిపోతాడు. చిన్నప్పుడే జరిగిన ఈ సంఘటన భరత్ ని జీవితాంతం వెంబడిస్తుంది. తన తప్పిపోయిన తండ్రి(జాకీ ష్రాఫ్)కు చిన్న ప్పుడే ఓ మాట ఇస్తాడు. పెద్ద కొడుకుగా తన తల్లిని, తన వాళ్లని చూసుకుంటూ అని, ఏదో ఒక రోజు తన కుటుంబం అంతా ఒకటి అవుతుందని  ఎదురుచూస్తాడు. తన తండ్రికి ఇచ్చిన మాట  కోసమే అతను జీవితాంతం ఎన్ని కష్టనష్టాలైనా భరిస్తాడు. అతని ఎదుగుదల..భారతదేశంలో మార్పులు జరుగుతూంటాయి. 1947 నుంచి 2010 దాకా దాదాపు ఆరు దశాబ్దాల పాటు...స్వాతంత్య్రం, దేశ విభజన, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, ఆర్థిక మాంద్యం.. ఇలా ప్రతి దశనూ దాటుకుంటూ, ప్రతి సవాల్‌నూ ఎదుర్కొంటూ, ప్రతి గాయాన్నీ తట్టుకుంటూ భారత దేశం ఎదిగినట్లుగానే అతను ముందుకు వెళ్తాడు. చివరకు అతను తండ్రి కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా..? అది ఏమిటి..? అలాగే అతని జీవితంలోకి వచ్చిన కుముద్‌ (కత్రినా కైఫ్‌) వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ లు మైనస్ లు ..

ఈ సినిమాలో మన దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  జరిగిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. పీరియాడిక్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో దేశ విభజన సమయంలో విడిపోయిన తండ్రీకొడుకుల పాత్రలను జాకీ, సల్మాన్‌ పోషించారు. యవ్వనం నుండి వృద్దాప్యం వరకూ.. అంటే 25 నుండి 65 వరకూ.. ఐదు దశల్లో సల్మాన్‌ పాత్ర ఉంటుందీ చిత్రంలో. అది సల్మాన్ అభిమానులకు పండుగే. అలాగే ఈ సినిమాలో ఆయనకు భార్యగా ప్రియాంక చోప్రా, చెల్లెలుగా దిశా పటానీ నటించారు.

ఇక  సల్మాన్‌ ఎమోషనల్ గా చెప్పే డైలాగులు  సింపుల్‌గా, షార్ప్‌గా ఉన్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.  అయితే  సీరియస్‌ గా నడిచే చోట కూడా  కామెడీని మిక్స్ చేసి ఫీల్ మిస్ చేసాడంటూ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక ఈ రీమేక్ వెర్షన్ లో నేటివిటికి మార్చే క్రమంలో  అక్కడక్కడా  సినిమాటెక్ లిబర్టీ తీసుకని కొన్ని సీన్స్ ల్లో లాజిక్‌ వదిలేసారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. విశాల్‌, శేఖర్‌ అందించిన సంగీతం కూడా  బాగుంది. కెమెరా వర్క్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

నచ్చుతుందా..?

ఈ చిత్రాన్ని ఒక ఎమోష‌న‌ల్ జర్నీ గా చూస్తే నచ్చుతుంది. అంతేకాని సల్మాన్ రెగ్యులర్ సినిమాలాగ చూస్తే నచ్చదు. సల్మాన్, కత్రీనాల అదరకొట్టారు, అలీ అబ్బాస్ కామెడీ, పలు ఎమెషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. మరి సల్మాన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్దాయిలో ఆడుతుందా , ఫ్యాన్స్ కు నచ్చుతుందా లేదా అన్నది తెలియాలంటే ఈ వీకెండ్ దాటాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios