Asianet News TeluguAsianet News Telugu

ఫ్లాఫే కానీ కళ్లు తిరిగే కలెక్షన్స్

గురువారం సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది.

Salman Khan Radhe Movie first day collections jsp
Author
Hyderabad, First Published May 15, 2021, 11:14 AM IST

సాధారణంగా మనకు సినిమా హిట్ అంటే అర్దం కలెక్షన్స్ పరంగానే లెక్కేస్తాము. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాక...హిట్ కు, కలెక్షన్స్ వసూలు కు సంభందం లేకుండా పోతోంది. టాక్ వచ్చేలోగా వసూలు జరిగిపోతోంది. ఇప్పుడు అదే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే కు జరిగింది. దేశమంతటా కరోనాతో అల్లకల్లోమవుతున్న వేళ ఈ  భారీ చిత్రం ప్రేక్షకులను పలకరించింది. గురువారం సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది.

జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది చూసినట్లు ట్రేడ్ లో లెక్కలు వేసారు. అంటే ఈ సినిమా తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయినట్లే. ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249 కాబట్టి. 42 లక్షల మంది తలో 249 రూపాయలు ఖర్చుపెట్టారంటే వసూళ్లు 104 కోట్లకు పైగానే ఉండాలి. 

అయితే తొలి రోజే ఫ్లాఫ్ టాక్ రావటంతో...ఈ ఊపు రెండో రోజుకు లేదు. మరో ప్రక్క రాధె’ విదేశీ మార్కెట్ల నుంచి రూ.5 కోట్ల మేర మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ఇక ఆల్రెడీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు తోడు కొత్తవాళ్లు ‘రాధె’ కోసం  ‘జీ’ ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. రాధెతో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్ 499కి అందించింది జీ. ఈ ఆఫర్ వాడుకున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారని అంచనా. కాబట్టి ఆ విధంగా కూడా ‘జీ’కు భారీగానే ఆదాయం సమకూరి ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios