బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ పూజా హెగ్దే జంటగా హిందీలో భారీ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సల్లూ బాయ్ తన అభిమానుల కోసం చిత్రం నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్ ను రిలీల్ చేశాడు.
బాలీవుడ్ రొమాంటిక్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) తన అభిమానులు ఎప్పుడూ ఏదో విధంగా సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. కొత్త విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్టు తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘టైగర్ 3’ తర్వాత తన నెక్ట్స్ ఫిల్మ్ ‘కభీ ఈద్ కభీ దివాళి’లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 12న ముంబైలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ కూడా పూర్తయ్యింది. ఈ సందర్భంగా బాయ్ జాన్ ట్వీట్ చేస్తూ ‘నా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం...’ అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో పాటు అదిరిపోయే ఫొటోను కూడా పంచుకున్నాడు.
సల్మాన్ ఖాన్ కొత్త లుక్‌లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్, స్టైలిష్ బియర్డ్, సన్ గ్లాసెస్ తో సల్మాన్ ఖాన్ న్యూ లుక్ దుమ్మురేపుతోంది. చేతికి చైన్ వేసుకొని, పొడవాటి రాడ్ ను పట్టుకున్న సల్మాన్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ లో సల్లుూ బాయ్ నే గూస్ బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. సరికొత్త లుక్ లో సల్మాన్ ఖాన్ కనిపించడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘మ్యాన్.. సల్-మాన్, బాలీవుడ్ కా బాప్, హి ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లుపెడుతున్నారు. అయితే Kabhi Eid Kabhi Diwali ఫస్ట్ లుక్ ను సల్మాన్ ఖాన్ ముందే చూపించారేమోనని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు ఈచిత్ర షూటింగ్ ప్రారంభమైనట్టు హీరోయిన్ పూజా కూడా తెలిపింది. ప్రస్తుతం ముంబైలో షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘కభీ ఈద్ కభీ దీవాళి’లో హీరోహీరోయిన్లుగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తున్నారు. దర్శకుడు
ఫర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్నారు. నదియాద్వాలా బ్యానర్ పై సాజిద్ నదియాద్వాలా మరియు సల్మాన్ ఖాన్ కలిసి నిర్మిస్తున్నారు. కీలక పాత్రలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, ఆయుష్ శఱ్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 30న చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేస్తున్నారు మేకర్స్.
