సూపర్‌స్టార్‌ మహేష్బాబు తాజా చిత్రం ‘మహర్షి’భాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. టాక్ డివైడ్ గా ఉన్న కలెక్షన్స్ లో మాత్రం కుమ్మేస్తోంది. దాంతో ఈ సినిమాకు రీమేక్ ఆఫర్స్ వరసపెట్టి వస్తున్నాయి. గతంలో మహేష్ బాబు చిత్రం పోకిరిని గిల్లీగా రీమేక్ చేసిన విజయ్ ఈ సినిమాని తమిళంలో ప్లాన్ చేస్తున్నారు. అదే పోకిరిని  హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ హిందీలో ఈ రీమేక్ కు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

సల్మాన్ ఖాన్ కోసం నిర్మాత దిల్ రాజు స్పెషల్ షో   ఏర్పాటు చేయబోతున్నారట. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతోపాటు సల్మాన్‌ సినిమా  చూడనున్నట్లు తెలిసింది. సినిమా సల్మాన్‌కు నచ్చితే రీమేక్‌కు ప్లాన్‌ చేయబోతున్నట్లు చెబుతున్నారు. 

కలెక్షన్స్ విషయానికి వస్తే...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఈ చిత్రం రీసెంట్ గా  'ఎఫ్ 2' మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డును అధిగమించి 2019లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. అయితే మహేష్ గత చిత్రం 'భరత్ అనే నేను' రికార్డ్(రూ. 54 కోట్లు) అధిగమించడంలో విఫలైంది.