బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ ఓ వానరానికి ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు ఇవ్వబోతే అది బాటిల్ ని నెట్టేసింది.

ఈ సంఘటనను   వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొదటి కోతికి అరటిపండ్లు ఇచ్చిన సల్మాన్.. ఆ తరువాత ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఇవ్వబోతే.. అది తిరస్కరించింది. దీంతో సల్మాన్ ఒక కప్పులో నీళ్లు పోసి ఇవ్వగానే వెంటనే తాగేసింది.

దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన సల్మాన్.. ''మా భజరంగీ భాయిజాన్ ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడు'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన అభిమానులు సల్మాన్ పలు సందర్భాల్లో జంతువుల పట్ల చూపించిన ప్రేమ తాలుకు ఫోటోలను షేర్ చేస్తూ సల్మాన్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.