వేటకి సిద్ధం అయిన సల్మాన్ ఖాన్, క్రేజీ పోస్టర్ అవుట్.. ఆన్ ది రోడ్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధంగా ఉంది.

టైగర్ 3 నుంచి సల్మాన్ ఖాన్ క్రేజీ లుక్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన మేకర్స్ సల్మాన్ ఖాన్ అలియాస్ టైగర్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సల్మాన్ ఇనుప గొలుసు పట్టుకుని శత్రువుల భరతం పట్టటానికి సిద్ధంగా కనపడుతున్నారు.
ఈ పోస్టర్ ద్వారా ‘టైగర్ 3’ చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటూనే ప్రేక్షకులకు వావ్ అనిపించేలా ఉంది. ఇక ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని అందరిలోనూ క్యూరియాసిటీ పెరుగుతుంది. తిరుగులేని శక్తితో టైగర్ తన శత్రువులను వేటాడటానికి సిద్ధంగా ఉందని అది ట్రైలర్‌తో మరోసారి తెలియనుందని అవగతమవుతుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 రానుంది. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘టైగర్ 3 చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. టైగర్ ఫ్రాంచైజీ విషయానికి వస్తే అందులో హీరోని లార్జర్ దేన్ లైఫ్‌లా ఆవిష్కరిస్తారు. హీరో అందులో హీరో ఆయుధం లేకుండానే శత్రువుల అంతం చూస్తాడు. తన శత్రువుల్లో చివరివాడు అంతమయ్యే వరకు టైగర్ అలాగే నిలబడి ఉంటాడు. తను సవాళ్లను స్వీకరిస్తాడు. దాన్ని పూర్తి చేయటంలో వెనకడుగు వేయడు. నిజ జీవితంలోనూ టైగర్ తన వేటను పూర్తి చేసే వరకు వెనకడుగే వేయదు. ఇందులో నా పాత్ర టైగర్‌లా ఉంటుంది. హీరో పాత్ర పోరాటంలో వెనక్కి తగ్గకుండా ఉంటుంది. తను అస్సలు వెనక్కి తగ్గడు. దేశం కోసం చివరి వరకు నిలబడే వ్యక్తి తనే అవుతాడు.
‘ఆన్ ది రోడ్’ మూవీ ట్రైలర్
పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రం ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలొ విడుదలకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను, ట్రైలర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలోని విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్ ను ప్రశంసించారు, సినిమా విజయం సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాలకు పని చేయడం విశేషం.
ప్రముఖ చిత్ర నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తూ ఈ ప్రాజెక్టులో ఒక భాగం అయ్యారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ట్రైలర్ మరియు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉన్నాయని తప్పకుండా ప్రేక్షకాదరణ చూరగొంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ పీ ఎల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నిసూర్య లక్కోజు నిర్మించారు. రాజేష్ శర్మ ఈ సినిమాకు సహ నిర్మాత.