బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. ఇక వీడియో షేర్ చేస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, సల్మాన్ ఖాన్ కొరడాతో కొట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

పోతురాజు వేషధారణలో ఉన్న కొంతమందిని సల్మాన్ ఖాన్ ఇటీవల కలుసుకున్నాడు. వారితో కాసేపు ముచ్చటించిన భాయ్ అనంతరం వారి దగ్గర నుంచి కొరడా తీసుకొని సరదాగా తాను కూడా కొట్టుకున్నాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వారితో గడిపి వారి బాధను తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే మీరు ఇలా ట్రై చేయకండి, ఎవరు మీద కూడా ప్రయోగించకండని సల్మాన్ పేర్కొన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don't try this on your self or on any 1 else

A post shared by Salman Khan (@beingsalmankhan) on Aug 30, 2019 at 11:00pm PDT