ఈ సినిమా నుంచి ‘బిల్లి బిల్లి’ పాటను విడుదల చేశారు. ఈ పాట కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. 


రీసెంట్ గా గాడ్ ఫాధర్ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించి, స్టెప్స్ వేసిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఆయన ఇప్పుడు వెంకీతోనూ డాన్స్ లు వేసారు. ఈ పాటలో పూజ కూడా ఉండటంతో ఓ రేంజిలో క్రేజ్ వస్తోంది. వివరాల్లోకి వెళితే..

 సల్మాన్ ఖాన్ (Salman Khan) తాజాగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. వెంకటేశ్, జగపతి బాబు, షెహనాజ్ గిల్, విజేందర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఫర్హద్ సామ్జీ (Farhad Samji) తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ పత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈద్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. 

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘బిల్లి బిల్లి’ పాటను విడుదల చేశారు. ఈ పాట కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సాంగ్ ను విడుదల చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గురువారం యూట్యూట్‌లో ‘బిల్లి బిల్లి’ పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ పాటలో సల్మాన్ ఖాన్ తో పాటు నటి పూజా హెగ్డే, షహనాజ్ గిల్, భూమికా చావ్లా, విక్టరీ వెంకటేష్, పాలక్ తివారీ, సిద్దార్థ్ నిగమ్, జస్సీ గిల్ ఇతర నటీనటులు కనిపిస్తున్నారు. సల్మాన్, వెంకటేష్ స్టెప్పులు సరదాగా ఉన్నాయి.

ఇక ఈ ‘కిసి కా భాయ్ కిసి కీ జాన్’ సినిమాను తమిళ నటుడు అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘వీరమ్’ కు రిమేక్ గా సల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగులో ‘కాటమరాయుడు’ గా తీశారు. రెండు చోట్లా ఈ సినిమా మంచి ఫలితాన్నే అందించింది. దాంతో ఈ సినిమా పై ముందు నుంచీ అంచనాలు బాగానే ఉన్నాయి.

 ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ (God Father) లో అతిథి పాత్రను పోషించాడు. మసూమ్ భాయ్ పాత్రలో కనిపించాడు. షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ లోను మెరిశాడు. ప్రస్తుతం ‘టైగర్ 3’ (Tiger 3) లో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రను పోషిస్తున్నాడు.