హిందీ `బిగ్‌బాస్‌`(bigg boss15) లేటెస్ట్ సీజన్‌కి టైమ్‌ ఆసన్నమైంది.  సల్మాన్‌ ఖాన్‌(salman khan) హోస్ట్ గా ఈ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ షో హౌజ్‌లోకి వెళ్లేవారెవరనేది ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 

హిందీ బిగ్‌బాస్‌కి రంగం సిద్ధమైంది. బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. శనివారం రాత్రి నుంచి ఈ కొత్త సీజన్‌ ప్రారంభం కాబోతుంది. హిందీలో కలర్స్ టీవీలో ఈ రియాలిటీ షో ప్రసారమవుతుంది. అయితే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ లిస్ట్ బయటకు వచ్చింది. అంతేకాదు విడుదలైన ప్రోమో సైతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్ గా ఈ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ షో హౌజ్‌లోకి వెళ్లేవారెవరనేది ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రముఖ హిందీ నటుడు తేజస్వి ప్రకాష్‌ ముందుగానే కొన్ని లీక్‌లిచ్చారు. గాయకులు ఆకాశ సింగ్‌ కూడా హౌజ్‌లోకి వెళ్లబోతున్నట్టు తెలిపారు. ఆకాశ పాపులర్‌ సింగర్ అనే విషయం తెలిసిందే. ఆమె `ఖీచ్‌ మేరీ ఫోటో`, `నాగిన్‌`, `థగ్‌ రంజా`, `నయ్యో` వంటి పాటలతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. 

మరోవైపు మోడల్‌, నటుడు డోనల్ బిష్ట్, అసిమ్‌ రియాజ్‌ తమ్ముడు ఉమర్ రియాజ్‌ కూడా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ గా వెళ్తున్నట్టు టాక్. బిగ్‌బాస్‌ ఓటీటీ ఫైనలిస్ట్ ప్రతీక్‌ సెహజ్‌పాల్‌, నిశాంత్‌ భట్‌, షమితా శెట్టి కూడా సల్మాన్‌ హౌజ్‌లోకి వెళ్తున్నట్టు బాలీవుడ్‌ సమాచారం. వీరితోపాటు బుల్లితెర స్టార్స్ కరన్‌ కుంద్రా, నటుడు సింబా నాగ్‌పాల్‌, విధి పాండ్యా, విశాల్‌ కొటియన్‌, సాహిల్‌ ష్రాఫ్‌, రియాలిటీ టీవీ స్టార్ట్ మిషా అయ్యర్, సింగర్ అఫ్సానా ఖాన్‌ సైతం బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ ఇంటి సభ్యుల లిస్ట్ లో ఉన్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి.