గుండెపోటుకి గురైన తన సహ నటుడు దాదీ పాండేకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సాయం అందించారు. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ప్రభుదేవా 'దబాంగ్ 3' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇందులో పాండే కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పాండేకి గుండెపోటు వచ్చింది. 'దబాంగ్ 3' సెట్స్ లో ఈ ఘటన జరగనప్పటికీ ఆయన బాగోగులు చూసుకోవాలని సల్మాన్ తన మనుషులను పంపించారు. గొరెగావ్ లోని హాస్పిట కి పాండేను తరలించారు.

త్వరలోనే ఆయన్ని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. సల్మాన్ తన పెద్ద మనసుతో పాండేని ఆదుకున్నాడని తెలుసుకున్న అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. 

దబాంగ్' సీక్వెల్ లో భాగంగా వస్తోన్న ఈ సినిమాను సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. డిసంబర్ 20న సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.