సల్మాన్‌(salman khan) హోస్ట్ గా ప్రసారమయ్యే హిందీ బిగ్‌బాస్‌ 15(bigg boss 15)వ సీజన్‌కి సర్వం సిద్ధమైంది. శనివారం రాత్రి ఈ లేటెస్ట్ సీజన్‌ ప్రీమియర్ ప్రారంభం కానుంది. ఊట్‌ యాప్‌లో ఈ ప్రీమియర్ లైవ్‌ ప్రసారం కానుంది. 

బిగ్‌బాస్‌ సందడి మళ్లీ మొదలవుతుంది. ఇప్పటికే తెలుగులో ఐదో సీజన్ ప్రారంభమైంది. నాలుగు వారాలకు చేరుకుంది. మరోవైపు వచ్చే వారంలో తమిళంలోనూ ప్రారంభం కానుంది. దీంతోపాటు కన్నడ, మలయాళంలో కొత్త సీజన్లకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌కి సర్వం సిద్ధమైంది. శనివారం రాత్రి ఈ లేటెస్ట్ సీజన్‌ ప్రీమియర్ ప్రారంభం కానుంది. ఊట్‌ యాప్‌లో ఈ ప్రీమియర్ లైవ్‌ ప్రసారం కానుంది. మరోవైపు కలర్ టీవీతోపాటు జీయో టీవీలోనూ దీన్ని చూడొచ్చు. 

ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ 15 ప్రోమో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో సల్మాన్‌ ఎంట్రీతోపాటు ఆయన ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. హౌజ్‌లోకి వెళ్లే సభ్యులు తమ కోసం తాము నిలబడాలని సల్మార్‌ తెలిపారు. విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లే ముందు అడవి లాంటి సెటప్‌లో కఠిన పరిస్థితుల్లో రెండు వారాలు గడపాల్సి ఉంటుందన్నారు. అందరి ముఖాల్లో నవ్వులు చూడాలని, కొంత రొమాన్స్, ఇంకొంత గేమ్లో ఎలా సర్వైవ్‌ అవుతారో చూడాలనుకుంటున్నాను అని తెలిపారు. సభ్యులు తమ కోసం, తమకిష్టమైన వారి కోసం పోరాడాలని కోరుకుంటున్నా అని తెలిపారు సల్మాన్. కండల వీరుడి సందేశం ఆకట్టుకోవడంతోపాటు ఈ సారి బిగ్‌బాస్‌15 సీజన్‌పై అంచనాలను పెంచుతుంది. 

Scroll to load tweet…

ఇక ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి కరణ్‌ కుంద్రా, సింబా నాగపాల్‌, విధి పాండ్య, విశాల్ కోటియన్‌, సాహిల్‌ ష్రాఫ్‌, మీషా అయ్యర్, తేజస్వి ప్రకాష్‌, ఆకాశ సింగ్‌, డోనల్‌ బిష్ట్, ఉమర్‌ రియాజ్‌ వెళ్తున్నారు. వీరిటోపాతు బిగ్‌బాస్‌ 15 ఓటీటీ సభ్యులు షమితా శెట్టి, పార్తిక్ సెహజ్‌పాల్‌, నిశాంత్‌ భట్‌ కూడా హౌజ్‌లోకి వెళ్తున్నారని సమాచారం.