తన వయసు గురించి దిశా పటానీ చేసిన కామెంట్స్ పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మండిపడ్డారు. సల్మాన్ నటించిన 'భారత్' సినిమాలో కత్రినా, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా.. సల్మాన్ వయసుపై కామెంట్స్ చేసింది.

భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయకపోవచ్చని, వయసు రీత్యా ఆయన తనకంటే ఎంతో పెద్దవాడని చెప్పింది. ఈ సినిమాలో సల్మాన్ కి పాతికేళ్ల వయసు ఉన్న సమయంలో ఆయన సరసన కనిపిస్తానని, అలా అన్ని సినిమాలకు కుదరదు కాబట్టి ఆయనతో కలిసి పనిచేయకపోవచ్చని కామెంట్స్ చేసింది.

ఈ కామెంట్స్ విన్న సల్మాన్ నొచ్చుకున్నారు. 'భవిష్యత్తులో దిశా నాతో కలిసి పనిచేయదా..? ఎందుకలా..? వయసు గురించి ఆమె అలా ఎలా మాట్లాడుతోంది..? నేనేమైనా మైనర్ తో కలిసి సినిమాలు చేస్తున్నానా..?' అంటూ మండిపడ్డారు. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.