ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, సల్మాన్ మాజీ ప్రేయసి పాకిస్థాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆ దేశానికి చెందిన కొందరు వ్యక్తులు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపుల వెనుక కారణాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి
ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సోమి అలీ (Somy Ali)... పాకిస్థాన్ కి చెందిన కొందరు మగవాళ్ళు నన్ను చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారు. దీనికి కారణం తను నడిపిస్తున్న ‘నో మోర్ టియర్స్’ ఎన్‌జీవో అని ఆమె తెలిపారు. సోమి అలీ ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ ఉంటుంది ఆమె.
ముఖ్యంగా గే విక్టిమ్స్‌కి సోమీ చట్టపరమైన రక్షణ కల్పించటంలో ముందుంటుంది. అదే చాలా మంది కోపానికి, ప్రతీకారానికి కారణమట. దీంతో ‘నువ్వు ఎప్పుడు పాకిస్తాన్ వచ్చినా వదిలిపెట్టెదే లేదు. నిన్ను చంపి తీరుతాం’ అంటూ తరచూ అక్కడి పురుషుల నుంచి తనకు మెయిల్స్ వస్తుంటాయని, అందుకే తాను కొన్నేళ్లుగా పాక్‌కు వెళ్లడం లేదని సోమి స్పష్టం చేసంది. అక్కడికి వెళితే తనకు ప్రాణ గండం తప్పదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికాకు చెందిన సోమి అలీ బాలీవుడ్ పై మక్కువతో ముంబై వచ్చారు. ఆ క్రమంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపారు. దాదాపు పదేళ్ల పాటు సోమి అలీ-సల్మాన్ కి మధ్య ఎఫైర్ నడిచింది. బులంద్ అనే చిత్రంతో ఆమె నటిగా మారారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. 1994లో విడుదలైన అంత్ మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. 1997 వరకు బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేశారు సోమి అలీ. 1997లో విడుదలైన 'చుప్' ఆమె చివరి చిత్రం.
Also read AP Tickets Prices: టికెట్స్ ధరల వివాదం... ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఉతికిపారేసిన వర్మ
సల్మాన్ (Salman Khan) తో బ్రేకప్ తర్వాత సోమి అలీ అమెరికా వెళ్లిపోయారు. హీరోయిన్ గా కెరీర్ కూడా అనుకున్నంత విజయం సాధించని నేపథ్యంలో ఆమె పరిశ్రమ వీడి వెళ్లిపోవడం జరిగింది. అమెరికా వెళ్ళాక ఆమె సోషల్ యాక్టివిస్ట్ గా మారారు. హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడి జీవితాలు కోల్పోతున్న అమ్మాయిల విముక్తి కోసం ఆమె స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో సోమి అలీ జన్మించారు. తమకు వ్యతిరేకంగా సోమి అలీ పని చేస్తుందనే అసహనంతో ఆమెపై ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Also read Rashmika Mandanna : స్టార్ హీరో సినిమాను కాదన్న రష్మిక..? టాలీవుడ్ వద్దు.. బాలీవుడ్ ముద్దు అంటోంది.
