AP Tickets Prices: టికెట్స్ ధరల వివాదం... ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఉతికిపారేసిన వర్మ
టికెట్స్ ధరల ఇష్యూని ఓన్ చేసుకున్న వర్మ అలుపెరగని పోరాటానికి తెరలేపారు. వరుసగా టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
టిక్కెట్స్ ధరల (AP Tickets Prices) విషయంలో ఏపీ ప్రభుత్వంపై చిత్ర పరిశ్రమ పోరాటం చేస్తుండగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటుగా స్పందించారు. లేటుగా స్పందించినా ఘాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్స్ ధరల ఇష్యూని ఓన్ చేసుకున్న వర్మ అలుపెరగని పోరాటానికి తెరలేపారు. వరుసగా టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా వర్మ (Ram gopal varma) సోషల్ మీడియా వేదికగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని సూటిగా ప్రశ్నించారు. వర్మ తన ట్వీట్స్ లో... నిత్యావసర వస్తువులు గోధుమ, వరి, నూనె, కిరోసిన్ ధరలు ప్రభుత్వం నియంత్రిస్తుంది. సినిమా టికెట్స్ కి ఈ సూత్రం ఎలా వర్తిస్తుంది. ధాన్యం ధరలు తగ్గిస్తే.. రైతులు సైతం వాటిని పండించాలనే ఆసక్తికోల్పోతారు . దాని వలన లభ్యత, నాణ్యత తగ్గిపోతుంది. ఇదే సూత్రం సినిమాకు కూడా వర్తిస్తుంది.
ఒకవేళ సినిమాను మీరు నిత్యావసర సేవగా భావిస్తే వైద్యం, విద్య విషయంలో అమలు చేస్తున్నట్లు సబ్సిడీ ఇవ్వండి. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టండి. రేషన్ షాపుల మాదిరి రేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయండి. నిత్యావసర ధరలు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. టికెట్స్ ధరలు ప్రభుత్వం నిర్ణయించాల్సిన ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు ఏమి తలెత్తిందో చెప్పండి.
సినిమా టికెట్స్ పేదవారికి తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశం మీకుంటే కొన్ని టికెట్స్ ప్రభుత్వం తరపున కొనండి. అవి నేరుగా పేదవారికి తక్కువ ధరకు ఇవ్వండి. అప్పుడు నిర్మాతలుగా మా డబ్బులు మాకొస్తాయి. మీ ఓట్లు మీకు పడతాయి. ధరల నియంత్రణ అనేది ఎప్పుడూ ప్రతికూల ప్రభావమే చూపుతుంది. ఇది నిరూపించబడింది. అది కొరత సృష్టిస్తుంది. అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఆర్థిక వేత్త ఆడమ్ స్మిత్ సైతం ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ అనర్ధాలకు దారితీస్తుందని చెప్పారు.
అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ రెమ్యూనరేషన్ వాళ్ళ ట్రాక్ రికార్డు ఆధారంగా అంచనా వసూళ్లకు అనుబంధంగా నిర్మాణ వ్యయంలో భాగమై ఉంటుంది. ఇక మీకు అధికారం ఇచ్చింది పేదలకు మద్దతుగా నిలబడానికి అంతే కానీ వాళ్ళ భుజాలపై కూర్చొని తొక్కడానికి కాదు . పరిశ్రమలో నాతో పని చేస్తున్న వారందరూ టికెట్స్ ధరలపై వాళ్ళ నిజమైన ఫీలింగ్స్ తెలియజేశాయి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేరు. ఇది కేవలం నా విజ్ఞప్తి కాదు.. డిమాండ్ కూడానూ. ఇకపై మీ ఖర్మ...
ఇలా వర్మ తన ట్వీట్స్ ద్వారా మంత్రి పేర్ని నానిని ప్రశ్నించారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ మాట్లాడాలని చెప్పారు. ఒక విధంగా ఆయన అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వర్మ సడన్ గా ఈ స్థాయిలో ఏపీ ప్రభుత్వంపై దాడికి దిగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. టికెట్స్ ధరల విషయం దాదాపు మూడు నెలలుగా హాట్ టాపిక్ గా ఉంది. వర్మ ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.