బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ అప్పుడపుడు డిఫరెంట్ స్టయిల్ లో ఇంటర్నెట్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తాడు.ఈ స్టార్ హీరోకి సంబందించిన ఎలాంటి వీడియో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా సల్మాన్ గణేష్ వేడుకల్లో చిందులేసిన వీడియో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. 

సాధారణంగా సల్మాన్ భాయ్ ప్రతి ఏడాది గణేష్ వేడుకల్లో ఎంతో ఇష్టంగా పాల్గొంటాడు.  తన ఇంట్లో గణేష్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించడం ఈ హీరోకు అలవాటే. ఇకపోతే రీసెంట్ గా ముంబై విధుల్లో సల్మాన్ గణేష్ నిమర్జనం జరుగుతుండగా స్టెప్పులేస్తూ కనిపించాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా తనదైన శైలిలో డ్యాన్స్ చేశాడు. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.