లాక్‌ డౌన్‌ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ పూర్తిగా తన ఫాం హౌస్‌కే పరిమితమయ్యాడు. ఫాం హౌస్‌లో ఉండే బిజినెస్‌ కార్యక్రమాలు చూడటంతో పాటు వీడియో సింగిల్స్‌ను కూడా రిలీజ్ చేశాడు సల్మాన్. అంతేకాదు ఈ ఖాళీ సమయంలో వ్యవసాయం చేయటం ఫాం హౌస్‌ క్లీన్ చేయటం లాంటి పనులు చేస్తూ ఆ వీడియోలను రిలీజ్ చేశాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు సల్లూ భాయ్‌.

తన ఫాంలో మాస్క్ ధరించి సైకిల్ తొక్కుతున్న ఫోటోను షేర్ చేశాడు కండల వీరుడు. ఈ ఫోటో పాటు జాగ్రత్తగా ఉండండి (స్టే సేఫ్) అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ ఫోటోపై నెటిజెన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. సల్మాన్ పోస్ట్‌కు కామెంట్‌ లో `సల్మాన్ సైకిల్ తొక్కుతుంటే ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి` అంటూ కామెంట్  చేశాడు. మీరు ఫుట్‌పాత్‌పై సైకిల్ తొక్కొద్దు అంటూ మరో నెటిజెన్‌ కామెంట్‌ చేశాడు.

సల్మాన్‌పై గతంలో హిట్ అండ్‌ రన్‌ అనే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఫుట్‌ పాత్ మీద నిద్రిస్తున్న వారి మీదకు మధ్యం సేవించి కారు ఎక్కించినట్టుగా సల్మాన్ మీద ఆరోపణలు వినిపించాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్‌ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గత రంజాన్ సీజన్‌లోనే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.