సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. వంద కోట్ల క్లబ్ అనేది సల్మాన్ కి మామూలు విషయం.

పదేళ్ల క్రితమే అతడు వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఇప్పుడు అతడు నటించిన 'భారత్' సినిమా కూడా విడుదలైన నాలుగో రోజే ఈ మార్క్ ని అందుకుంది. వరుసగా సల్మాన్ ఖాన్ సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం ఇది 14వ సారి కావడం విశేషం. 

పదేళ్ల క్రితం సల్మాన్ నటించిన 'దబాంగ్' సినిమా వంద కోట్లు గ్రాస్ దాటిందని గొప్పగా చెప్పుకున్నారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ సినిమాలకు వంద కోట్లు అనేది కామన్ అయిపోయింది. రెడీ, బాడీగార్డ్, కిక్, జైహో, ఏక్ థా టైగర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబంగ్-2, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్-3 ఇలా గత పదేళ్లలో సల్మాన్ నటించిన సినిమాలు వంద కోట్ల మార్క్ ని దాటేశాయి. ఇందులో కొన్ని  సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు తగ్గలేదు.