మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్, రాంచరణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. తెలుగులో సల్మాన్ ఖాన్ కు రాంచరణ్ డబ్బింగ్ కూడా చెబుతుంటాడు. సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సల్మాన్ ఖాన్ ని రాంచరణ్ సతీమణి ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. 

ఈ ఇంటర్వ్యూలో సల్మాన్ అనేక విషయాలు చెబుతూ రాంచరణ్ గురించి ప్రస్తావించాడు. ఐదు పదుల వయసులో కూడా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కుర్రహీరోలని తలదన్నే ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. ధృవ చిత్రానికి ముందు వరకు రాంచరణ్ కండల ప్రదర్శన చేయలేదు. ఆ చిత్రంలో షర్ట్ లేకుండా నటించాడు. ధృవలో రాంచరణ్ మేకోవర్ కు ప్రశంసలు దక్కాయి. 

రాంచరణ్ అలా కనిపించడంలో తన క్రెడిట్ కూడా ఉందని సల్మాన్ ఖాన్ అంటున్నాడు.షర్ట్ లేకుండా కాన్ఫిడెంట్ గా నటించాలంటే తన ట్రైనర్ రాకేష్ ఉదయార్ ఆధ్వర్యంలో కొన్నిరోజుల పాటు జిమ్ లో కష్టపడాలని సలహా ఇచ్చినట్లు సల్మాన్ ఖాన్ తెలిపాడు. అతడి సమక్షంలో రాంచరణ్ దృవ సినిమా కోసం జిమ్ లో కష్టపడ్డాడు.