దబాంగ్ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి అప్పట్లో సరికొత్త రికార్డులను నేర్పిన సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సిరీస్ తో కూడా రచ్చ చేయడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఈ సారి కథలో విలన్ పాత్ర రేంజ్ స్క్రీన్ పై ఎవరు ఊహించని అంచనాలతో ఉండాలని దర్శకుడు ప్రభుదేవా మంచి యాక్టర్ నే పట్టాడు. 

కన్నడ స్టార్ హీరో సుదీప్ సల్మాన్ తో పోట్లాడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో వెరైటీ రోల్స్ తో అలరించిన సుదీప్ ఈగ సినిమాతో మరింతగా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పుడు సల్మాన్ సినిమాలో భయంకర విలన్ గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. 

మధ్య ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. దర్శకుడు ప్రభుదేవా సల్మాన్ తో పోకిరి రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇక చాలా రోజుల తరువాత సల్మాన్ తో వర్క్ చేస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఈ బాక్స్ ఆఫీస్ కాంబో ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి.