Asianet News TeluguAsianet News Telugu

Salaar Release Date : అఫీషియల్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. నయా పోస్టర్ తో అనౌన్స్ మెంట్

‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ అందింది. కొత్త పోస్టర్ తో అనౌన్స్ మెంట్ అందించారు మేకర్స్. 

Salaar Release Date  announced by Makers NSK
Author
First Published Sep 29, 2023, 11:17 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Salaar : Part 1  - Ceasefire. అన్నీ బాగుంటే ఇప్పటికే ఈ  భారీ ఫిల్మ్ సెప్టెంబర్ 28న విడుదలయ్యేది. ఈపాటికి డార్లింగ్ ఫ్యాన్స్ హవా కొనసాగుతూ ఉండేది. కానీ కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉండటం, మరింత బెస్ట్ అవుట్ అందించేందుకు మేకర్స్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే వాయిదా వేసిన మేకర్స్ నెక్ట్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేయడం కాస్తా టైమ్ తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ‘సలార్’ ఈ ఏడాదే అని కొందరు, కాదు వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. దీంతో ఫ్యాన్స్, నార్మల్ ఆడియెన్స్ కు విడుదల తేదీపై మరింత ఆసక్తి పెరిగింది. ఆ సందేహాలన్నింటికి బదులు చెబుతూ మేకర్స్  అప్డేట్ అందించారు. కొద్దిసేపటి కింద Salaar Release Dateను అనౌన్స్ చేశారు. 2023 డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇప్పటికే నెట్టింట ప్రచారమైన డేట్ నే ‘సలార్’ మేకర్స్ కన్ఫమ్ చేయడం విశేషం. ఇక అదే రోజు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం కూడా విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్ విషయం లో షారుఖ్ తగ్గేదే లే అని స్పష్టం చేశారంట. దీంతో ‘సలార్’, ‘డుంకీ’ పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ నెల అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉండటంతో అప్పటి నుంచి వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్ నూ గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 

ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’తో ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టారు. దీంతో ‘సలార్’ సినిమాపై ఊహాకు అందనంతగా అంచనాలున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయిక. పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios