Asianet News TeluguAsianet News Telugu

`సలార్‌` పై అనుమానాలకు పుల్‌స్టాప్‌ పెట్టేది అదే.. వస్తే ఒక లెక్క, రాకపోతే మరో లెక్క..

ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` సినిమా రిలీజ్‌కి సంబంధించి ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. ఇప్పుడైనా వస్తుందా? మళ్లీ వాయిదా పడుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

salaar promotion start not yet movie will come or not ?
Author
First Published Nov 8, 2023, 3:11 PM IST | Last Updated Nov 8, 2023, 3:11 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న భారీ యాక్షన్‌ మూవీ `సలార్‌`. `బాహుబలి` తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు బోల్తా కొట్టాయి. దీంతో అందరి చూపు `సలార్‌`పైనే ఉంది. `కేజీఎఫ్‌` వంటి సంచలన మూవీస్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ ఈ మూవీకి డైరెక్టర్‌ కావడంతో అంతా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అందరు ఈ మూవీపైనే నమ్మకం పెట్టుకున్నారు. ప్రభాస్‌ కి ఈ చిత్రమైన హిట్‌ ఇస్తుందని, ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందని భావిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఉన్నారు. 

కానీ ఈ మూవీ తరచూ వాయిదా పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే రావాల్సిన ఈ మూవీ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు డిసెంబర్‌ 22న ఫైనల్‌ చేశారు. సీజీ వర్క్ కంప్లీట్‌ కాకపోవడం వల్లే సెప్టెంబర్‌ 28న రావాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్‌ చేశారు. అయితే ఇప్పుడు సీజీ వర్క్ కంప్లీట్‌ అయ్యిందా? అనుకున్న విధంగా వీఎఫ్‌ఎక్స్ వచ్చాయా? అనేది అనుమానంగా ఉంది. 

ఇదిలా ఉంటే ఇటీవల సినిమా రిలీజ్‌కి 50 రోజులే ఉందంటూ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ చేశారు. ఈ ఏమేరకు అప్‌డేట్‌ ఇచ్చారు. అలాగే కేరళా రైట్స్ పృథ్వీరాజ్‌ సుకుమార్‌ తీసుకున్నట్టుగానూ ప్రకటించారు. అనౌన్స్ మెంట్లు ఉంటున్నాయి, కానీ కంటెంట్‌ రిలేటెడ్‌ అప్‌డేట్లు రావడం లేదు. అదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అనేక అనుమానాలకు తావిస్తుంది. 

ఇదిలా ఉంటే నెక్ట్స్ వీక్‌లో అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందట. నవంబర్‌ రెండో వారంలో `సలార్‌`లోని ఓ పాటని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సినిమాలో రెండు పాటలున్నాయని, ఒకటి హీరో ఇంట్రో సాంగ్‌, రెండు కథలో భాగంగా వచ్చే మాంటేజ్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. వాటిని ముందుగానే విడుదల చేసే అవకాశం ఉందట. అంతేకాదు ఈసారి డేట్‌ తప్పకూడదని, మరోసారి వాయిదా లేకుండా అనుకున్న డేట్‌కే రిలీజ్‌ చేయాలని ప్రశాంత్‌ నీల్‌ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. 

ఆ ప్రకారంగానే పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారట. ఈ క్రమంలో కంటెంట్‌ రెడీ అయ్యాక ప్రమోషన్స్ కి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సీజీ వర్క్ ఎంత వరకు పూర్తయ్యిందనేది ప్రశ్న. ఈ వారంలో పాటని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ రాకపోతే అనుమానించాల్సిన విషయమే అనే టాక్‌ కూడా ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుంది. వినిపిస్తున్న మరో వార్త ప్రకారం సినిమా వచ్చే ఏడాదికి పోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి ఏం జరుగుతుంది? ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడైనా మాట మీద నిలబడతాడా? ప్రభాస్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాడా? అనేది చూడాలి.  ఈ వారం వచ్చే అప్‌డేట్లని బట్టే సినిమాపై ఆడియెన్స్ లో నమ్మకం ఏర్పడుతుంది. ఫస్ట్ సాంగ్‌ వస్తే ఒక లెక్క, రాకపోతే మరో లెక్క. మరి టీమ్‌ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో, పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించింది. దీన్ని డిసెంబర్‌ 22న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయబోతున్నారు. మొదటి భాగం ఇప్పుడు వస్తే, రెండో భాగం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఉందని టాక్‌.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios