Asianet News TeluguAsianet News Telugu

Salaar: రక్తపాతం సృష్టిస్తున్న ప్రభాస్, పోస్టర్ అదుర్స్.. 'సలార్' అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదిగో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'. ఈ చిత్ర షూటింగ్ మొదలై చాలా కాలమే అయింది. చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలవుతుంది అని ఫ్యాన్స్ ఆశ పడ్డారు.

Salaar prabhas look and release date is here
Author
First Published Aug 15, 2022, 1:22 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'. ఈ చిత్ర షూటింగ్ మొదలై చాలా కాలమే అయింది. చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలవుతుంది అని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ అభిమానుల ఆశలు ఫలించలేదు. కనీసం సలార్ అప్డేట్ కూడా రాలేదు. 

ఎట్టకేలకు ఆ కోరిక తీర్చారు చిత్ర యూనిట్. సలార్ చిత్రం నుంచి ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. 

ప్రశాంత్ నీల్ స్టైల్ లో బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో పోస్టర్ కనిపిస్తోంది. ఆరడుగుల కటౌట్ తో ఉండే ప్రభాస్ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని శత్రువులని ఊతకోత కోస్తున్నాడు. 

దిమ్మ తిరిగేలా ఉన్న ఈ పోస్టర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. ఊర మాస్ పోస్టర్ ఆంటూ కామెంట్స్ పెడుతున్నారు. ది ఎరా ఆఫ్ సలార్ బిగిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. 

కెజిఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థే సలార్ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. సలార్ చిత్రం ఎలాంటి కథతో తెరకెక్కుతోంది అనే విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు. అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్ ఈ చిత్రంలో కమాండర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా సలార్ లేటెస్ట్ పోస్టర్, రిలీజ్ డేట్ ప్రకటనతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. సాహో, రాధే శ్యామ్ లాంటి నిరాశ పరిచే చిత్రాల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ సాలిడ్ కమ్ బ్యాక్ కోరుకుంటున్నారు. సలార్ కంటే ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కానుంది. 

ప్రశాంత్ నీల్ ఈ చిత్రం కోసం ఇంత టైం తీసుకుంటున్నాడు అంటే ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతోందో అర్థం అవుతోంది. ఏది ఏమైనా ప్రభాస్ అభిమానులకు మరో ఏడాది నిరీక్షణ తప్పదు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios