Asianet News TeluguAsianet News Telugu

Salaar: ప్రభాస్‌ ఈజ్‌ బ్యాక్‌?.. `సలార్‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు?.. ఓవర్సీస్‌లో షాకిచ్చే రేట్‌..

`సలార్‌` బిజినెస్‌ లెక్కలపై అంతా ఫోకస్‌ చేశారు. ఈ సినిమా ప్రీ  రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు ఇప్పుడు నెట్టింట షాకిస్తున్నాయి. హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. అంతేకాదు మైండ్‌ బ్లాంక్‌ చేసే రేట్స్ వినిపిస్తుండటం, అటు ఫ్యాన్స్ ని, ట్రేడ్‌ వర్గాలను షషాక్‌కి గురి చేస్తున్నాయి. 

salaar overseas rights total pre release business prabhas is back?
Author
First Published Apr 1, 2023, 8:52 PM IST

ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి పాన్‌ ఇండియా రేంజ్‌ని పరిచయం చేసిన హీరో. `బాహుబలి`తో ఆయన సంచలనాలు సృష్టించారు. ఇండియన్‌ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన నటించిన `బాహుబలి 2` ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్‌కి ఆ స్థాయి హిట్‌ పడలేదు. తర్వాత నటించిన `సాహో` ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. `రాధేశ్యామ్‌` దారుణంగా పరాజయం చెందింది. దీంతో డార్లింగ్‌ సత్తా చూపించలేకపోయాడు.

ఇప్పుడు ఆయన రేంజ్‌ని చూపించే సినిమాలు రాబోతున్నాయి. `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` సినిమాలు ప్రభాస్‌ మార్కెట్‌ని చూపించబోతున్నారు. ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అందులో ముఖ్యంగా `సలార్‌`పై ఇప్పుడు అసలు గేమ్‌ నడుస్తుంది. `ప్రాజెక్ట్ కే`కి ఇంకా చాలా టైమ్‌ ఉన్ననేపథ్యంలో ఇప్పుడు అంతా `సలార్‌` బిజినెస్‌ లెక్కలపై అంతా ఫోకస్‌ చేశారు. ఈ సినిమా ప్రీ  రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు ఇప్పుడు నెట్టింట షాకిస్తున్నాయి. హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. అంతేకాదు మైండ్‌ బ్లాంక్‌ చేసే రేట్స్ వినిపిస్తుండటం, అటు ఫ్యాన్స్ ని, ట్రేడ్‌ వర్గాలను షషాక్‌కి గురి చేస్తున్నాయి. 

తాజాగా ఓవర్సీస్‌ రైట్స్ డిటెయిల్స్ లీక్‌ అయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఓవర్సీస్‌ రైట్స్ రూ.70కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. ఈ మొత్తానికి ఫైనల్‌ అయ్యిందట. కానీ ఇందులో మరోవెర్షన్‌ కూడా వస్తుంది. చిత్ర బృందం మాత్రం వంద కోట్లు డిమాండ్‌ చేయగా, ఫైనల్‌గా తొంబై కోట్లకు ఫైనల్‌ అయ్యిందని సమాచారం. మరి ఈ రెండింటింలో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ గత సినిమాలను మించి బిజినెస్‌ జరిగిందని సమాచారం. `బాహుబలి2` ఓవర్సీస్‌ రైట్స్ 70కోట్లకు పోయాయి, `ఆర్‌ఆర్‌ఆర్‌`కి కూడా ఆల్మోస్‌ 65-70కోట్లు పలికింది. ఇప్పుడు `సలార్‌` దాన్ని మించి ఓవర్సీస్‌ రైట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. 

మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన ఇతర ఏరియాల లెక్కలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో నైజాం రైట్స్ షాకిస్తున్నాయి. ఈ సినిమా వంద కోట్లకి నైజాం రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. నైజాం తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఏరియాగా అవతరిస్తుంది. `బాహుబలి`, `కేజీఎఫ్‌`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలతో ఆ విషయం స్పష్టమవుతుంది. దీంతో ఇక్కడి ఏరియాకి డిమాండ్‌ బాగా పెరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారట. మరి `సలార్‌` నైజాంలో వంద కోట్లకు అమ్ముడు పోయిందనే వార్తలో నిజనిజాలు మరికొన్ని రోజుల్లో తేలనుంది. 

ఇక ఆంధ్రా, సీడెడ్‌ ఏరియాలోనూ ఈ సినిమా భారీగానే రైట్స్ పలుకుతున్నాయట. సుమారు 130కోట్ల వరకు డిమాండ్‌ వినిపిస్తుందట. ఇందులో సీడెడే రూ.35కోట్ల వరకు అడుగుతున్నారట. హిందీ బెల్ట్(నార్త్) సుమారు రూ. 150కోట్ల వరకు పలుకుతున్నట్టు టాక్‌. ఇప్పుడు తెలుగు సినిమాకి నార్త్ బిగ్గెస్ట్ మార్కెట్‌ అయిపోయింది. మాస్‌, యాక్షన్‌ సినిమాలకు అక్కడ ఆదరణ దక్కుతుంది. ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన `కేజీఎఫ్‌2` అక్కడ సత్తా చాటింది. పైగా ప్రభాస్‌కి నార్త్‌లో మంచి మార్కెట్ ఉంది. ఈ ఇద్దరి కలియికలోవస్తోన్న సినిమా కావడంతో నార్త్ రైట్స్ విషయంలో డిమాండ్‌ బాగానే ఉందని, హోంబలేఫిల్మ్స్ మేకర్స్(సలార్‌ నిర్మాతలు) భారీ మొత్తానికే అమ్మే ఆలోచనలో ఉన్నారట. అందులో భాగంగానే ఎంత లేదన్నా 150 కోట్ల వరకు ఆశిస్తున్నట్టు సమాచారం. 

వీటితోపాటు `సలార్‌`కి భోనస్‌గా వచ్చేది సౌత్‌. తమిళం, కన్నడ, కేరళ. ఈ మూడు స్టేట్స్ లో కలిసి వంద కోట్ల వరకు ఈ సినిమా రైట్స్ అమ్ముడు పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. సుమారు అటు ఇటుగా ఆ స్థాయిలో డిమాండ్‌ వస్తుందట. ఇలా కేవలం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ద్వారానే `సలార్‌` చిత్రానికి సుమారు రూ. 500కోట్లకు పైగా పలికే అవకాశం ఉందంటున్నారు. దీంతోపాటు డిజిటల్‌, శాటిలైట్స్ రైట్స్ రూపంలోనూ ఈ సినిమాకి మరో 400-500కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. మొత్తంగా `సలార్‌` రిలీజ్‌కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్‌ చేయబోతుందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. ఈ సినిమా కేవలం 350 నుంచి నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. కలెక్షన్ల పరంగానే సుమారు వెయ్యి నుంచి 1500కోట్లు అంచనాలు వేస్తున్నట్టు సమాచారం. మరి ఆ స్థాయిలో సత్తా చాటుతుందా? అనేది చూడాలి. 

ప్రభాస్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `సలార్‌` చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సింగరేణి బోగ్గు గనుల నేపథ్యంలో మాఫియా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌ కార్మిక నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇందులో `కేజీఎఫ్‌` ఫేమ్‌ యస్‌ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారట. ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios