రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అప్డేట్స్ కోసం కొత్తగా ట్విట్టర్ హ్యాండిల్ ను స్టార్ట్ చేశారు. ఈ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య ఓ రేంజ్ లో పెరిగిపోతోంది.
స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై ఉండగానే సోషల్ మీడియా అకౌంట్స్ స్టార్ట్ చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సర్కారు వారి పాట వంటి ట్విట్టర్ హ్యాండిల్స్ లక్షల మంది ఫాలోయర్స్ కలిగి ఉన్నారు. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకు ఓ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ స్టార్ట్ చేస్తున్నారు. సదరు అకౌంట్ ద్వారా మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు. ఓ మూవీకి సంబంధించిన అభిమానులను చేరుకోవడం దీని ద్వారా సులభం అవుతుంది. దీంతో తప్పుడు సమాచారం, రూమర్లకు చెక్ పెట్టినట్లవుతోంది.
ఈ సందర్భంగా ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న Salaar సినిమా కోసం కూడా ట్విట్టర్ లో అఫిషియల్ గా Salaar The Saga పేరిట ట్విట్టర్ హ్యాండిల్ ను నిన్న ప్రారంభించారు. అయితే ఈ అంకౌంట్ ప్రారంభించిన 24 గంట్లోల్లోనే 40కే ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కు ఒక్కరోజులోనే 67.5కే లైక్స్ అందాయి. ఈ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోతుండటం చూస్తే ‘సలార్’ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
కాగా సలార్ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే 30-35 శాతం షూటింగ్ పూర్తయిందట. 2023 సమ్మర్ కానుకగా మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. గత షెడ్యూల్స్ ను గోదావరిఖని మైన్స్ లో చిత్రీకరించారు. నెక్ట్స్ షెడ్యూల్ మే 24 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ (Shruthi Haasani) నటిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ హీరో ప్రుథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని హుంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
