Asianet News TeluguAsianet News Telugu

#Salaar ‘షారుఖ్’కి సలార్ టీమ్ సెటైర్, గట్టిగానే ఇచ్చిందే!

నార్త్ లో  స‌లార్‌కి అతి త‌క్కువ థియేట‌ర్లే ద‌క్కాయి. అందులో షారూఖ్ ప్రమేయం ఉంది. అయితే  ఆక్యుపెన్సీ విష‌యంలో మాత్రం డంకీని డింకీలు కొట్టించింది స‌లార్‌.

Salaar makers posted a satire on Shah Rukh Khan jsp
Author
First Published Jan 2, 2024, 6:28 AM IST


2023 లాస్ట్ వీకెండ్ లో ప్రభాస్ సలార్ అలాగే షారుఖ్ ఖాన్ డంకీ మధ్య భారీ పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ కాగా డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ రిలీజ్ అయ్యాయి. అయితే సలార్ అన్ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా డంకీ మాత్రం కేవలం హిందీ వెర్షన్  మాత్రమే రిలీజ్ అయింది. అయితే రిలీజ్ ముందు వరకు రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అనుకున్న స్దాయిలో  డంకీ కలెక్షన్స్ రాకపోయినా థియేటర్ల కేటాయింపు విషయంలో షారుక్ ఖాన్ ప్రమేయంతో సలార్ మొదట ఇబ్బంది పడింది. దాంతో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న సలార్ నిర్మాతలు షారూఖ్ ని టార్గెట్ చేస్తున్నారు. 

 ఈ మధ్యకాలంలో భారీ అంచనాల మధ్య రూపొందిన  చిత్రాల్లో ‘సలార్‌’ (Salaar) ఒకటి. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  డిసెంబరు 22న విడుదల అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది.  క్రిస్మస్‌ హాలీడేస్‌తో పాటు, సంక్రాంతి వరకూ మరో సినిమా విడుదలయ్యే అవకాశం ఉండకపోవడంతో ‘సలార్‌’కు కలిసొస్తుందని చిత్ర బృందం భావించింది. కానీ, ఒకే ఒక్క సినిమా ‘సలార్‌’ను ఢీకొట్టే ప్రయత్నం చేసింది. అదే షారుక్‌ ‘డంకీ’ (Dunki). రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకుడు. ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద రెండుసార్లు ‘పఠాన్‌’, ‘జవాన్‌’లతో రూ.1000కోట్లు వసూలు చేసి, మరోసారి తాను కలెక్షన్‌ కింగ్‌ఖాన్‌ అనిపించుకున్నారు షారుక్‌. ‘సలార్‌’ డిసెంబరు 22న వస్తుందన్న ప్రచారం మొదలైన దగ్గరి నుంచి షారుక్‌ అభిమానులు సోషల్ మీడియాలో  మీమ్స్‌తో ముంచెత్తారు. అయితే డంకీ చిత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటంతో  ‘సలార్‌’ హై సక్సెస్ అయ్యి తన స్టామినా ఏమిటో చూపించింది. అయితే సలార్ కు థియేటర్స్ ఇవ్వటంలో డంకీ టీమ్ చేసిన రాజకీయాలు అందరికీ చిరాకు తెప్పించాయి. 

ఈ క్రమంలోనే సలార్ మేకర్స్ షారుఖ్ ఖాన్ పై సెటైర్ వేశారు. పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా సలార్ నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ కలెక్షన్స్ అనౌన్స్ చేస్తూ “ ఖాన్సార్.. ఐయామ్ సారీ ” అంటూ బాక్సాఫీస్ పోస్టర్‌ను ప్రకటించారు . వారు ఉద్దేశ్యపూర్వకంగా ఖాన్సార్ వరల్డ్‌ని ఉపయోగించి సెటైర్ చేసారని అందరికీ అర్దం అయ్యింది, షారుఖ్ ను ఖాన్ సార్ అని అభివర్ణిస్తారు. దాన్నే ఉపయోగిస్తూ ఈ ట్వీట్ చేసారు.  ఇక ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ  ఆ ట్వీట్‌ని ఉపయోగించి షారూఖ్ అభిమానులకు కౌంటర్లు ఇస్తున్నారు. సాలార్ మేకర్స్ ట్వీట్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇలా కౌంటర్ ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. 

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ..  సలార్‌ వర్సెస్‌ డంకీ ఫైట్‌పై సోషల్‌ మీడియాలో  జరుగుతున్న చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఇద్దరు టాప్‌ హీరోల సినిమాల మధ్య గొడవలు పడుతుంటారు. 'నేను అలాంటి వాటిని ప్రోత్సహించను. అలాంటివి వినడానికి కూడా ఇష్టపడను. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీపడరు. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ‘సలార్‌’, ‘డంకీ’ల మధ్య చాలా మంది అనుకుంటున్నట్లు ప్రతికూల వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. డంకీ నిర్మాతలు కూడా మనలాగే పాజిటివ్‌గా ఆలోచించాలి. మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ కాదు.' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్‌లో సలార్‌ చిత్రానికి థియేటర్లు లేకుండా చేసిన కొందరు సలార్ కు రివ్యూలు కూడా నెగటివ్‌గానే చెప్పడం జరిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios