ప్రభాస్‌ నటించిన `సలార్‌` రికార్డుల మోత ప్రారంభమైంది. ఈ మూవీ తొలి  రోజు భారీ కలెక్షన్లని సాధించింది. ఈ ఏడాది హైయ్యేస్ట్ వసూళ్లు చేసిన మూవీని నిలిచింది. 

ప్రభాస్‌ నటించిన `సలార్‌` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్, ఎలివేషన్లు, భారీ యాక్షన్‌ సీన్లు ఆడియెన్స్ కి గూస్‌బంమ్స్ తెప్పించాయి. రిలీజ్‌కి ముందు నుంచే సినిమాపై బజ్‌ భారీగా పెరిగింది. ప్రీమియర్స్ ద్వారా భారీగా రాబట్టింది. ఇక మొదటి రోజు ఎక్ట్సా షోస్‌ కూడా వేశారు. అన్నీ హౌజ్‌ ఫుల్‌ నడిచాయి. 

ఇక ముందునుంచే ఈ మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలుస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనుకున్నట్టుగానే కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ చిత్రం ఏకంగా 178.7కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్‌ వసూళ్లని రాబట్టడం విశేషం. ఇందులో దాదాపు వంద కోట్ల షేర్‌ సాధించిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఇది హైయ్యెస్ట్ గ్రాస్‌ చేసిన మూవీనిగా `సలార్‌` నిలిచింది. 

ఇక తెలంగాణలోనూ ఈ సినిమా భారీగానే చేసింది. సుమారు రూ. 32కోట్ల గ్రాస్‌ చేసింది. 19కోట్ల షేర్‌ సాధించింది. మరోవైపు తమిళనాడులోనూ బాగా చేసింది. అక్కడ ఏడు కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. జనరల్‌గా తమిళంలో తెలుగు సినిమాలు ఆడవు. `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` మాత్రమే మంచి వసూళ్లని రాబట్టాయి. ఇప్పుడు `సలార్‌` కూడా గౌరవప్రదమైన కలెక్షన్లు సాధిస్తుందని చెప్పొచ్చు. 

Scroll to load tweet…

అయితే `సలార్‌`కి నార్త్ లో దెబ్బ పడుతుంది. షారూఖ్‌ ఖాన్‌ `డంకీ` చిత్రానికి ఎక్కువగా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు కేటాయించడంతో `సలార్‌` కి చాలా తక్కువ స్క్రీన్లు లభించాయి. లేదంటే సింగిల్‌గా `సలార్` వచ్చి ఉంటే కచ్చితంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డులను `సలార్‌` బ్రేక్‌ చేసేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయినప్పటికీ ఈ ఏడాది రికార్డులు కొల్లగొట్టిన `జవాన్‌`, `పఠాన్‌`, `యానిమల్‌`, `జైలర్‌` సినిమాల రికార్డులను `సలార్‌` బ్రేక్‌ చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.