కంఫర్మ్ .. బాక్సాఫీస్ వద్ద సలార్ X డుంకి.. ప్రీమియర్స్ కూడా ఖరారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి థండర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి థండర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ ప్రశాంత్ నీల్ క్రేజీ ఎలివేషన్ ఇచ్చారు.
అయితే సెప్టెంబర్ 28న ఈ చిత్రం రిలీజ్ కావడం గ్యారెంటీ అనుకున్న తరుణంలో అనూహ్యంగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతోంది అంటూ బలమైన ప్రచారం జరుగుతోంది. త్వరలోనే చిత్ర యూనిట్ కూడా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్ నటించిన డుంకి చిత్రం కూడా ఆ రోజే రిలీజ్ కి రెడీ అవుతోంది. సలార్, డుంకి బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం ఆల్మోస్ట్ కంఫర్మ్. రెండు చిత్రాల నిర్మాతలు యూస్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా అప్డేట్స్ ఇచ్చేశారు. దీనితో యుఎస్ లో ఈ రెండు చిత్రాలు డిసెంబర్ 21న ప్రీమియర్స్ కి రెడీ అవుతున్నాయి. ఇక అధికారిక ప్రకటన మాత్రమే తరువాయి.
ఇదే కనుక జరిగితే కనీవినీ ఎరుగని బాక్సాఫీస్ పోటీని చూడొచ్చు. డుంకి చిత్రం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి భారీ హిట్స్ తో జోరుమీద ఉన్నారు. ఇక ప్రభాస్ నుంచి బాహుబలి తర్వాత సరైన చిత్రం లేదు. దీనితో ప్రభాస్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు తలపెడితే బాక్సాఫీస్ జాతర జరుగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.