Asianet News TeluguAsianet News Telugu

`సలార్‌ 2` షూటింగ్‌ అప్‌డేట్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త.. కానీ `కల్కి2898ఏడీ`తో లింక్‌?

ప్రభాస్‌ గతేడాది `సలార్‌`తో భారీ హిట్‌ని అందుకున్నాడు. `సలార్‌ 2` కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ `కల్కి2898ఏడీ`తో ముడిపడి ఉండటం విశేషం.  
 

salaar 2 shooting update its link with kalki2898ad arj
Author
First Published Apr 15, 2024, 6:28 PM IST

ప్రభాస్‌ చివరగా `సలార్‌` చిత్రంతో వచ్చాడు. `సలార్‌ః సీజ్‌ ఫైర్‌` పేరుతో పార్ట్ 1 చిత్రం వచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఖాన్సార్‌ రాజ్యం ప్రధానంగా సాగే ఈ యాక్షన్‌ మూవీ ఇండియన్‌ ఆడియెన్స్ ని మెప్పించింది. భారీ వసూళ్లని రాబట్టింది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకు వస్తున్నట్టు ముందునుంచే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు. దీంతో మొదటి భాగంలో సగం కథే చెప్పారు. అనేక అనుమానాలను వదిలేశారు. 

ప్రభాస్‌ నటించిన దేవా, పృథ్వీరాజ్‌ నటించిన వరదా రాజమన్నార్ పాత్రలు స్నేహంగా ఉండి, ఎందుకు విడిపోయారు, ఇద్దరి మధ్య గొడవేంటి? అలాగే రాజమన్నార్‌ ఎందుకు తన అధికారాన్నీ వదులుకోలేదు, శౌర్యాంగ తెగలకు చెందిన దేవా ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు, ఖాన్సార్‌కి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? రాజమన్నార్‌ సమయంలో ఉన్నా శౌర్యంగా నాయకుడు ఎవరు? పెద్ద ప్రభాస్ పాత్ర ఏంటి? `సలార్‌`లో ఫస్ట్ లుక్‌ సమయంలో విడుదల చేసిన పోస్టర్‌ వెనుక కథేంటి? శృతి హాసన్‌ పాత్ర కథేంటి? ఇలా అనేక ప్రశ్నలను వదిలేశారు దర్శకుడు. అవన్నీ `సలార్‌ 2`పై ఆసక్తిని పెంచాయి. దీంతో వెంటనే ఆ సినిమా చూడాలనే ఉత్సుకతని కలిగిస్తున్నాయి. 

`సలార్‌ 2` ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఎందుకంటే ప్రభాస్‌ చేతిలో చాలా సినిమాలున్నాయి. సందీప్‌రెడ్డి వంగాతో `స్పిరిట్‌` మూవీ చేయాల్సి ఉంది. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అయిపోతుంది, `సలార్‌2` ఎప్పుడు స్టార్ట్ కావాలి, అలాగే హనురాఘవపూడితో సినిమా పరిస్థితి ఏంటి? అనేది మిస్టరీగా మారింది. అయితే `సలార్‌2`నే త్వరగా ప్రారంభమవుతుందనే టాక్‌ వచ్చింది. ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. జూన్‌, లేదా జులైలోనే `సలార్‌2ః శౌర్యంగ పర్వం` ప్రారంభం కానుందట. 

ప్రస్తుతం ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`లో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాని మే 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కాన వాయిదా పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌ డిలే కారణంగా, సీజీ వర్క్ డిలే కారణంగా వాయిదా పడుతుందనే టాక్‌ వచ్చింది. మరోవైపు ఏపీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అది సినిమాపై ప్రభౠవం పడుతుందని వాయిదా వేస్తున్నారని సమాచారం. జూన్‌లోగానీ, జులైగానీ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మూవీ విడుదలపై క్లారిటీ వస్తే, `సలార్‌2` షూటింగ్‌పైక్లారిటీ వస్తుంది. జూన్‌లో సినిమా విడుదలైతే, ప్రభాస్‌ జులై నుంచి ఫ్రీ అవుతాడు. దీంతో `సలార్‌ 2` షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే `సలార్‌2`కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ విషయం వినిపిస్తుంది. ఈ రెండో భాగం మూవీ చిత్రీకరణ చాలా వరకు ఇప్పటికే అయిపోయిందట. మొదటి పార్ట్ టైమ్‌లోనే చాలా భాగం షూట్‌ చేశారట. ఇప్పుడు కొన్ని మెయిన్‌ సీన్లని తీసి ముగిస్తారని, ఆ తర్వాత వెంటనే ఈ మూవీని రిలీజ్‌ చేస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన `సలార్‌2`ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే `సలార్‌` ఫస్ట్ పార్ట్ ఈ ఆదివారం స్టార్‌ మాలో టెలికాస్ట్ కాబోతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios