Asianet News TeluguAsianet News Telugu

Salaar Collections: `సలార్‌` రెండు రోజుల కలెక్షన్లు.. ప్రభాస్‌ అసలైన వేట షురూ..

ప్రభాస్‌ కలెక్షన్ల వేట మొదలైంది. ఆయన నటించిన `సలార్‌` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ప్రస్తుతం ఇది భారీ వసూళ్ల దిశగా వెళ్లుంది.రెండో రోజుల్లో ఏకంగా.. 

salaar 2 days collections prabhas mania start arj
Author
First Published Dec 24, 2023, 5:12 PM IST

`సలార్‌` మూవీ కలెక్షన్ల వేట ప్రారంభమైంది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. మొదటి రోజు ఇది 178కోట్లు కలెక్ట్ చేయగా, రెండో రోజు సైతం భారీగానే రాబట్టింది. తాజాగా రెండు రోజుల కలెక్షన్లని చిత్ర బృందం ప్రకటించింది. ఏకంగా ఇది రూ.295.7 కోట్ల వసూళ్లని రాబట్టింది. రెండో రోజులు 117కోట్లని వసూలు చేయడం విశేషం. రెండో రోజు వంద కోట్లకుపైగా రావడం గొప్ప విషయంగా చెప్పొచ్చు. 

రెండు రోజుల్లోనే ఇది మూడు వందల కోట్ల మార్క్ కి చేరుకుంది. ఇక ఆదివారం `సలార్‌` భారీగానే వసూలు చేసే అవకాశాలున్నాయి. ట్రేడ్‌ వర్గాల ప్రకారం, బుకింగ్‌లను బట్టి చూస్తే, ఇది 120-130 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. సోమవారం కూడా క్రిస్మస్‌ హాలిడే కావడంతో ఆ రోజు కూడా సగానికిపైగానే ఉంటుంది. ఇలా తొలి వీకెండ్‌లోనే ఈ మూవీ నాలుగైదు వందల కోట్ల మార్క్ ని దాటేయబోతుంది. ఇక వీక్‌ డేస్‌లో మరో వంద వచ్చినా  500-600 కోట్లు దాటుతుంది. ఇక సంక్రాంతి వరకు ఈ మూవీకి తిరుగు లేదు. మొత్తంగా భారీ వసూళ్ల దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. అయితే వాస్తవంగా ఈ మూవీ రూ. 277కోట్లు చేసిందని టాక్‌.

ఇక తెలుగులో 33కోట్లు, తమిళంలో సుమారు ఐదు కోట్లు, కన్నడలో 6 కోట్లు, కేరళాలో మూడు కోట్లు చేసిందట. నార్త్ బెల్ట్ 20కోట్లు రాబట్టిందట. ఓవర్సీస్‌లో సుమారు నాలబై చేసిందని తెలుస్తుంది. మొత్తంగా ప్రశాంత్‌ నీల్‌ చేసిన మ్యాజిక్‌ `సలార్‌`ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇక దర్శకుడి టేకింగ్‌కి, ప్రభాస్‌ కటౌట్‌ తోడు కావడంతో మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. సినిమాకి ఉన్న హైప్‌ని దృష్ట్యా ఇది నాన్‌ `బాహుబలి` రికార్డులు బ్రేక్‌ చేస్తుందని ట్రేడ్‌ వర్గాల అంచనా. మరి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి. 

ప్రభాస్‌ హీరోగా, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ముఖ్య పాత్రలో నటించిన `సలార్‌`లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా కీలక పాత్రలో కనిపించింది. జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీరావు, ఝాన్సీ, సప్తగిరి ఇతర కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించింది. `కేజీఎఫ్‌` తర్వాత ప్రశాంత్‌ నీల్‌ నుంచి వచ్చిన మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దాన్ని మించి సినిమా ఉంది. అయితే కథ పరంగా, సీన్ల పరంగా కొన్ని లోపాలు ఉన్నా, యాక్షన్‌, ఎలివేషన్ల ముందు అవన్నీ చల్తా అయిపోయాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios