కాలం ఎంత విచిత్రంగా ఉంటుందో అప్పుడప్పుడు కొన్ని ఘటనలు ఉదాహరణగా నిలుస్తాయి. ఒకప్పుడు ఒకే క్లాస్ రూమ్ లో పక్కపక్కనే కూర్చున్న వ్యక్తులు అనుకోకుండా ఒకే రంగంలో ఎదురుపడితే ఆ అనుభవం వర్ణనాతీతం. 

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దర్శకుడు అయిన సాజిద్ నదియద్వాల కూడా అలాంటి అనుభవాన్నే రుచి చూశాడు.అక్షయ్ కుమార్ తన స్కూల్ ఫ్రెండ్ అని మళ్ళీ అతనితో కలిసి పని చేస్తానని ఊహించలేదని అన్నారు. చిచ్చోరే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సాజిద్ ఎవరికి తెలియని విషయాన్ని బయటపెట్టాడు. 

అక్షయ్ తో చిన్నప్పుడు డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నట్లు చెప్పిన సాజిద్ ఇద్దరం ఒకే క్లాస్ లో సేమ్ బెంచ్ లో కూర్చునేవాళ్ళమని తెలిపారు. సినీ ఫీల్డ్ లోకి వచ్చిన తరువాత 1993లో మొదటిసారి అక్షయ్ తో వక్త్ హామరా అనే సినిమాను నిర్మించినట్లు చెబుతూ.. కాలం మళ్ళీ మమ్మల్ని అలా కలుపుతుందని తాము ఉహించలేదని అన్నారు.