Asianet News TeluguAsianet News Telugu

వెంకీ ‘సైంధవ్’.. నాని ‘హాయ్ నాన్న’ టీజర్స్ రెడీ.. డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ‘సైంధవ్’, ‘హాయ్ నాన్న’ నుంచి బిగ్ అప్డేట్స్ అందాయి.  కొద్దిసేపటి కింద రెండు చిత్రాల నుంచి టీజర్ డేట్ అధికారికంగా వచ్చింది. 
 

Saindhav and Hai Nanna Movies Teaser date announced by team NSK
Author
First Published Oct 12, 2023, 4:49 PM IST

ఫ్యామిలీ సినిమాలతో అలరించే విక్టరీ వెంకటేశ్ (Venkatesh)  రూటు మార్చారు. యాక్షన్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ క్రమంలో వెంకీ చేస్తున్న యాక్షన్ ఫిల్మ్ Saindhav. ‘హిట్’ చిత్రాల డైరెక్టర్ శైలేశ్ కొలను  దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 

ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా ‘సైంధవ్’ రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేశారు యూనిట్. దీంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా పవర్ ఫుల్ టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కొద్దిసేపటి కింద టీజర్ డేట్ ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 16న ‘సైంధవ్’ టీజర్ విడుదల కానుందని అధికారికంగా తెలియజేశారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 13న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

Saindhav and Hai Nanna Movies Teaser date announced by team NSK

నేచురల్ స్టార్ నాని (Nani) చివరిగా ‘దసరా’తో రచ్చ రచ్చ చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. దీంతో నెక్ట్స్ రాబోతున్న చిత్రం Hai Nannaపైనా అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొదటి నుంచి ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, ఓ ఎమోషనల్ సాంగ్ ను విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని సినిమాపై పడేలా చేశారు. ఈ క్రమంలో మరో బిగ్ అప్డేట్ ను అందించింది యూనిట్. ‘హాయ్ నాన్న’ ట్రైలర్ రెడీ అయినట్టు చెప్పింది. 

తాజాగా Hai Nanna Teaserపై అప్డేట్ అందించారు. అక్టోబర్ 15న ఉదయం 11 గంటలకు బ్యూటీఫుల్ టీజర్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. టీజర్ బాగుంటుందని నాని మరింత ఆసక్తి పెంచేశారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేయబోతుందన్నారు. తండ్రి, కూతురు సెంటిమెంట్ తో రాబోతున్న ఈ చిత్రానికి శౌర్యూవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా నాని కూతురిగా అలరించబోతోంది. క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  కథానాయిక. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నండటం విశేషం. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇంకా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. 

Saindhav and Hai Nanna Movies Teaser date announced by team NSK

Follow Us:
Download App:
  • android
  • ios