ఆవకాయని అన్నంలో కలుపుకోవాలి గానీ.. ముఖానికి పూసుకోకూడదు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 31, Aug 2018, 12:43 PM IST
sailaja reddy alludu movie trailer released
Highlights

శైలజా రెడ్డి సినిమా ట్రైలర్ విడుదల

‘‘ ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి గానీ.. ఎర్రగా ఉంది కదా అని ముఖానికి పూసుకోకూడదు’ అంటున్నారు వెన్నెల కిషోర్. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘‘శైలజా రెడ్డి అల్లుడు’’. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేశారు.

 

నాగచైతన్య తన గురించి తాను చెబుతున్నట్లు సినిమా ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయల్ ల మధ్య నాగ చైతన్య నలిగిపోతాడనే విషయం ట్రైలర్ ని చూస్తే అర్థమౌతోంది. అదేవిధంగా సినిమాలో పృథ్వీ, వెన్నెల కిశోర్ ల పాత్రలకు కూడా స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader