తన అత్తతో చైతు లుక్ చూశారా..?

sailaja reddy alludu movie first look
Highlights

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు. అందులో అత్త, అల్లుడు, కూతురు కలిసి ఉన్న లుక్ ఒకటి కాగా, మరొకటి చైతు సోలో లుక్. ఇది ఇంతకముందే బయటకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఫ్యామిలీ లుక్ పైనే అందరి దృష్టి పడింది

అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న తాజా చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. టైటిల్ ప్రకారం ఈ సినిమా అత్త, అల్లుడుల మధ్య సాగే కథ అని తెలుస్తోంది. పవర్ ఫుల్ అత్త క్యారెక్టర్ లో రమ్యకృష్ణ కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు. అందులో అత్త, అల్లుడు, కూతురు కలిసి ఉన్న లుక్ ఒకటి కాగా, మరొకటి చైతు సోలో లుక్. ఇది ఇంతకముందే బయటకి వచ్చింది.

దీంతో ఇప్పుడు ఫ్యామిలీ లుక్ పైనే అందరి దృష్టి పడింది. ఈ లుక్ చూస్తున్న వారంతా కూడా పొగుడుతూనే ఉన్నారు. కోపంగా చూస్తోన్న అత్తగా రమ్యకృష్ణ కూతురు, అల్లుడు పాత్రల్లో చైతు, అను ఎమ్మాన్యుయల్ లు ఆకట్టుకున్నారు. టాలీవుడ్ లో అత్త-అల్లుడుల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు దర్శకుడు మారుతి మరోసారి అటువంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు.

హిలారియస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. 

loader