Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారు, కరీనా అంతలా టెంప్ట్ చేస్తోందా!

బాలీవడ్ క్రేజీ కపుల్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంట 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సైఫ్ కి ఇది రెండవ వివాహం. అంతకు ముందు సైఫ్  భార్య అమృత సింగ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.

Saif Ali Khan reveals why he is doing movies
Author
Hyderabad, First Published Nov 13, 2021, 10:01 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవడ్ క్రేజీ కపుల్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంట 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సైఫ్ కి ఇది రెండవ వివాహం. అంతకు ముందు సైఫ్  భార్య అమృత సింగ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీనా, సైఫ్ ల వివాహ బంధం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా హ్యాపీగా సాగిపోతోంది. సైఫ్ అలీ ఖాన్ కు అమృత సింగ్ తో ఇద్దరు పిల్లలు సంతానం. సారా అలీ ఖాన్, ఇబ్రహీం అమృత సింగ్ కు జన్మించారు. 

ఇక Kareena Kapoor, Saif Ali Khan దంపతులకు తైమూర్, జహంగీర్ జన్మించిన సంగతి తెలిసిందే. తైమూర్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడో అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ బంటీ ఔర్ బబ్లీ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సైఫ్ కి జోడిగా రాణీ ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ రీసెంట్ గా కపిల్ శర్మ షోకి హాజరయ్యాడు. 

ఈ షోలో తన సంతానం గురించి సైఫ్ తనపైన తానే సెటైర్ వేసుకున్నాడు. ఈ కామెంట్ అక్కడున్న వారందరిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. మీకు పనిమీద ప్రేమ ఎక్కువై ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారా ? లేక పిల్లలు పుడుతుండడం, ఫ్యామిలీ బాధ్యతల వల్ల సినిమాలు చేస్తున్నారా అని కపిల్ ప్రశ్నించాడు. దీనికి సైఫ్ సమాధానం ఇస్తూ.. ' ఫ్యామిలీ కోసం కాదు కానీ.. ఇంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారేమో అని భయంగా ఉంది.. అందుకే వర్క్ తో బిజీ అయిపోతున్నా' అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. 

Also Read: ట్రాన్స్ జెండర్ తో స్నేహం, ఆ విషయంలో ఎన్నో అవమానాలు... షాకింగ్ విషయాలపై ఓపెన్ అయిన చరణ్ వైఫ్ ఉపాసన

కపిల్ శర్మ షోకి సంబంధించిన ఈ వీడియో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైఫ్ స్టేట్మెంట్ తో.. కరీనా అంతలా టెంప్ట్ చేస్తోందా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ని రాముడిగా, సైఫ్ ని రావణుడిగా చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios