రెబల్ స్టార్ ప్రభాస్ మరో ఎగ్జైటింగ్ అప్డేట్ తో వచ్చేశారు. బాలీవుడ్  దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ మూవీలో ప్రధాన విలన్ పాత్ర చేస్తున్న నటుడి పేరు రివీల్ చేశేశారు. నిన్న సాయంత్రం '7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు' అని ఓ ఆసక్తికరమైన పోస్ట్ ఆదిపురుష్ టీమ్ పంచుకున్నారు. దీనితో ఆదిపురుష్ మూవీ నుండి విలన్ పాత్ర పరిచయం చేస్తున్నార్న ఆలోచనకు ప్రేక్షలకులు రావడం జరిగింది. 

ఇక అందరూ అనుకుంటున్నట్లుగానే ఆదిపురుష్ మూవీలో ప్రధాన విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు తెలియజేశారు. ఆదిపురుష్ మూవీ రామాయణ గాథగా తెరకెక్కుతుండగా ఇందులో లంకాధిపతి రావణాసురిడి పాత్ర సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆదిపురుష్ మూవీలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారంటూ ఈ మూవీ ప్రకటించిన నాటి నుండి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నేడు దీనిపై స్పష్టమైన ప్రకటన రావడం జరిగింది. 

ఇక రాముడుగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ మధ్య పోరు విజువల్ ఫీస్ట్ లా ఉంటుందని సమాచారం. దర్శకుడు ఓమ్ రౌత్ గత చిత్రం తన్హాజీలో కూడా సైఫ్ విలన్ రోల్ చేయడం విశేషం. కాగా ఆదిపురుష్ లో సీత పాత్ర చేసే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సివుంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి ఆదిపురుష్ మూవీ వెళ్లనుంది.