టాలీవుడ్లో ఈ తరం యువ కథానాయకుల్లో ఈజీ గోయింగ్ అనిపించే వాళ్లలో సాయిధరమ్ తేజ్ ఒకడు. హిపోక్రసీ ఏమీ లేకుండా ఉన్నదున్నట్లు మాట్లాడేస్తుంటాడతను. మామూలుగా హీరోలు తమ ఫ్లాపుల గురించి ఓపెనవ్వడానికి ఇష్టపడరు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం మొన్న ‘ఇంటిలిజెంట్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తాను నటించిన చివరి నాలుగు సినిమాలూ ఫ్లాపులే అని ఓపెన్ గా చెప్పేశాడు.

ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో తన ట్రాక్ రికార్డు గురించి కూడా ఇలాగే ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. తమన్.. తన కాంబినేషన్లో సినిమా అంటే అందులో పాటలు చాలా బాగుంటాయని.. ఆడియో సూపర్ హిట్టవుతుందని.. కానీ సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతుంటాయని తేజు ఓ ఇంటర్వ్యూలో అనడం విశేషం. ఇప్పుడు ‘ఇంటిలిజెంట్’ ఆడియో కూడా హిట్టయిందని.. కానీ ఈ సినిమా మాత్రం ఆ సెంటిమెంటును మారుస్తుందని.. సినిమా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని అతనన్నాడు.

తేజు అన్నది చాలా వరకు నిజమే. అతను తమన్ తో చేసిన సినిమాలు ‘తిక్క’.. ‘విన్నర్’.. ‘జవాన్’ ఆడియోలకు మంచి పేరొచ్చింది. కానీ ఆ సినిమాలు ఆడలేదు. ఐతే ఆ సినిమాల ఆడియోలతో పోలిస్తే ‘ఇంటిలిజెంట్’ పాటలకు అంత మంచి పేరేమీ రాలేదు. ఈ ఆడియో యావరేజ్ అన్న టాక్ వచ్చింది. మరి ‘ఇంటిలిజెంట్’ సినిమా బాగా ఆడేసి వీళ్ల ట్రాక్ రికార్డును మారుస్తుందేమో చూడాలి.