తేజ్ ఐలవ్ యూ.. ట్విట్టర్ రివ్యూ

saidharamtej and anupama starrer tej i love u twitter review
Highlights

మరోసారి ప్రేమకథతో వచ్చిన కరుణాకరన్
తేజ్ ఖాతాలో మరో ప్లాప్..?

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సాయిథరమ్ తేజ్ ఒకరు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మొదట్లో వరస హిట్లు కొట్టిన ఈ హీరో.. సరైన కథలను ఎంచుకోవడంలో విఫలమై.. వరస ప్లాపులను మూట గట్టుకున్నాడు. ఆ ప్లాప్ ఇమేజ్ ని తొలగించుకోవడానికి ఈసారి స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే తేజ్ ఐ లవ్ యూ.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్.రామారావు నిర్మించిన.. కరుణాకరన్ డైరెక్టర్ చేసిన ‘తేజ్’ క్లీన్ యూ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ట్రైలర్, పాటలు కూడా.. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీపై అంచనాలు పెంచేశాయి. అనుపమ పరమేశ్వరన్.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటికే పలువురు వీక్షించేశారు. వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

ప్రేక్షకుల ట్వీట్ల ప్రకారం.. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా.. తేజ్ ఐ లవ్యూ ప్రీమియర్ షోలను అమెరికాలో ఇప్పటికే ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసిన వారు ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్‌ను వినిపిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మొదలయ్యాయి. కొంతమంది మూవీ బావుందంటే.. కొందరు మాత్రం తేజ్ కాస్త నిరాశపరిచాడంటున్నారు. 

హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించినప్పటికీ.. సినిమా మాత్రం నిరాశపరించిందనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కరుణాకరన్.. రోటీన్ గా పాత కథనే మరోసారి చూపించే ప్రయత్నం చేశాడని వారి ట్వీట్ల ప్రకారం తెలుస్తోంది. పూర్తి రివ్యూ రావాలంటే మాత్రం మరికొద్ది సేపు ఆగాల్సిందే. 

loader