మహేష్ బాబు కన్నా అందగాడా...

First Published 5, Dec 2017, 9:28 AM IST
saidharam tej says nobody is handsome than mahesh babu
Highlights
  • జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయిధరమ్ తేజ్
  • జవాన్ చిత్రం హిట్ అవటంతో మరింత ప్రమోట్ చేస్తున్న తేజ్
  • ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి అడిగితే ఏమన్నాడో తెలుసా..

టాలీవుడ్ లో అందగాడు అనగానే టక్కున చెప్పే పేరు మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్స్ లో కూడా మహేష్ లాంటి అందగాడు లేడంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్ కటౌట్ తో మహేష్ టాలీవుడ్ ను ఏలుతున్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా మహేష్ క్రేజ్ మాత్రం చెక్కుచెదరదు.

 

మహేష్ గురించి పలువురు స్టార్స్ కూడా అదే రేంజ్ లో పొగడ్తలు గుప్పిస్తుంటారు. తాజాగా ఆ ఖాతాలో మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా చేరాడు. జవాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ్ సినిమా విశేషాలతో పాటుగా పలు ఇతర విషయాలను పంచుకున్నాడు. ఇక మహేష్ ప్రస్థావన రాగా మహేష్ మించిన అందగాడు ఉంటాడా సమస్యే లేదు.. అసలు అలా ఆలోచించడం కూడా వేస్ట్ అనేశాడు తేజ్.

 

మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మాత్రమే కాదు అతని చార్మింగ్ గురించి సాటి హీరోలే మాట్లాడటం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఇదవరకే చరణ్ కూడా మహేష్ లో ఉన్న అందం తనకు ఇచ్చి ఉంటే బాగుండేది అని చెప్పాడు. ఇప్పుడు సాయి ధరం తేజ్ ఏకంగా మహేష్ ను మించిన అందగాడు లేడని అంటున్నాడు.

 

loader