సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా రెండవసారి నటిస్తున్న చిత్రం ప్రతిరోజు పండగే. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోదాత్మక అంశాలతో మారుతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. 

హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో సాయిధరమ్ తేజ్ తో ఉన్న ఫోటోలని రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ఉంది. ఈ ఫొటోల్లో ఒకరినొకరు కౌగిలించుకుని కనిపిస్తున్నారు. ఆఫ్ స్క్రీన్ లోనే కెమిస్ట్రీ అదిరిపోతుంటే.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందో మరి!