మెగాహీరో సాయి తేజ్ 'చిత్రలహరి'తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న సాయి తేజ్ కొన్ని ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా సాయి తేజ్ స్పందించాడు.

తన తల్లి రెండో పెళ్లిపై కూడా ఓపెన్ గా మాట్లాడాడు. తాజాగా తన పెళ్లిపై వస్తోన్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా మెగాడాటర్ నీహారికతో సాయి తేజ్ పెళ్లి అంటూ వస్తోన్న వార్తలపై ఈ మెగా హీరో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదని, కానీ తన పెళ్లి విషయంలో చాలా స్టుపిడ్ రూమర్స్ వస్తున్నాయని అన్నారు.

ముఖ్యంగా నీహారికతో పెళ్లి అంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని మండిపడ్డారు. చిన్నప్పటి నుండి తను, నీహారిక బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నామని చెప్పుకొచ్చాడు. వారిద్దరి మధ్య పెళ్లి అనే ఆలోచన ఎప్పుడూ రాలేదని అన్నారు. అయినా చెల్లిని పెళ్లి చేసుకోవడమేంటి..? ఛీ ఛీ ఇది చాలా వరస్ట్ అంటూ మండిపడ్డారు.

ఇలాంటి వార్తలు రాయడానికి సిగ్గుండాలి అంటూ కొన్ని మీడియా ఛానెల్స్ పై ఫైర్ అయ్యారు. తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని.. నీహారికతనకు చెల్లితో సమానమని క్లారిటీ ఇచ్చారు.