ప్రియా ప్రకాష్ కు సాయిపల్లవి వార్నింగ్

ప్రియా ప్రకాష్ కు సాయిపల్లవి వార్నింగ్

ఇప్పుడు ఎక్కడ చూసినా కుర్రాళ్లంతా ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్ తో ఆమె కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మలయాళ, తమిళ, తెలుగు నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎవరూ వెనుకాడకపోవడం విశేషం. అలాంటి ప్రియా ప్రకాశ్ గురించి తాజాగా ఓ సందర్భంలో సాయిపల్లవి ప్రస్తావించింది.
 

ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఛాన్సులు సంపాదించుకుంటోన్న ప్రియా ప్రకాశ్ ఇకపై చాలా జాగ్రత్తగా వుండాలని సాయిపల్లవి అంది. స్టార్ డమ్ సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలాకష్టమని చెప్పింది. ఇక మీదట మరింత శ్రద్ధతో ఆలోచించి సినిమాలకి సైన్ చేయాలనీ, పారితోషికం గురించి కాకుండా కథా కథనాలు .. పాత్రను గురించి ఆలోచించాలని అంది. ఒక్క మాటలో చెప్పాలంటే .. కెరియర్ పరంగా తనలాగే ముందుకెళ్లకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయాన్ని స్పష్టం చేసిందన్న మాట.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos