Ram Charan: రామ్ చరణ్ కోసం సాయి పల్లవి, బుచ్చి బాబు ప్రయత్నం ఫలించేనా..?
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లను చూడబోతోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని కాంబోలు వెండితెరపై సందడి చేశాయి. ఇంక ముందు కూడా ఆడియన్స్ సర్ ప్రైజింగ్ జంటలను చూడనున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా మెగా హీరోతో.. సాయి పల్లవి జతకట్టబోతున్నట్టు సమాచారం.

రామ్ చరణ్ తో సాయి పల్లవి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే.. కమర్షియాలిటీ ఎక్కువగా ఉన్న సినిమాల్లో సాయి పల్లవి నటించదు. ఒక వేళ నటించినా.. ఆసినిమాలోహీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అంతే కాని హీరోయిన్ ను గ్లామర్ బొమ్మగా..ఎక్స పోజింగ్ కు, సాంగ్స్ కోసం, రొమాంటిక్ సీన్స్ కోసం వాడుకునేటట్టయితే అస్సలు ఒప్పుకోదు.
ఈ విషయంలో ఎంత పెద్ద సూపర్ స్టార్ పక్కన అవకాశం వచ్చినా.. సాయి పల్లవి రిజెక్ట్ చేస్తుంది. గతంలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశం రాగా..కథ విని వెంటనే రిజెక్ట్ చేసిందిసాయి పల్లవి. దాంతో సాయి పల్లవి చాలా స్పెషల్ అనిపించుకుంది. ఆమె దగ్గరకు వెళ్ళే సినిమాలు.. కథ చెప్పేదర్శకులు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. మంచి కథలు మాత్రమే ఆమె దగ్గరకు వెళ్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవి రామ్ చరణ్ తో జోడీ కట్టబోతుంది అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త.
రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ గేమ్‌ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ భారతీయుడు2 షూటింగ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను డిలేచేస్తున్నాడు శంకర్. ఈ విషయంపై ఇప్పటికే అభిమానుల్లో చర్చ గట్టిగా నడుస్తున్నది. గేమ్‌ఛేంజర్ సమ్మర్‌లో విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే.. రామ్‌చరణ్ హీరోగా నెక్ట్స్ సినిమాను ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈసినిమాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి..కాని కన్ ఫార్మ్ చేయలేదు. అందులో ముందు మృణాళ్ పేరు వినపడింది. ఆ తర్వాత జాన్వికపూర్ పేరు లైన్లోకొచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కాదు సాయిపల్లవి అని కొత్త వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.రూరల్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కావడంతో హీరోయిన్ గా సాయిపల్లవి అయితేనే బాగుంటందని బుచ్చిబాబు భావించాడట. సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ కథలో పల్లెటూరి అమ్మాయిగా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో.. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అంతే కాదు త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో విజయసేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నారు. మైత్రీమూవీమేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బానర్లపై నిర్మించనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. మరి ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు మేకర్స్. త్వరలో చేస్తారేమో చూడాలి.