లవ్లీ హీరోయిన్ సాయి పల్లవి ప్రతిసారి తన ప్రత్యేకత చాటుకుంటుంది. తాజాగా ఆమె  మెహందీ ఆర్టిస్ట్‌గా మారారు. షూటింగ్ సెట్స్ లో  తన దగ్గరకు వచ్చిన పిల్లలకు ఆమె గోరింటాకు పెట్టారు. దీనికి సంబంధించిన  ఫొటోలు, వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా సాయిపల్లవి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు. యూపీలో ఆమె నటిస్తున్న సినిమా షూట్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు షూటింగ్‌ మధ్యలో దొరికిన ఖాళీ సమయంలో తనని చూసేందుకు వచ్చిన చుట్టపక్కల ఇళ్లల్లోని పిల్లలకు సాయిపల్లవి సరదాగా గోరింటాకు పెట్టారు. 

ఆ ఫొటోలను సాయి పల్లవి సోషల్ మీడియాలో పంచుకోగా దానికి సెలెబ్రిటీలు స్పందించారు.. సాయి పల్లవి హ్యాపీ క్లయింట్స్‌ అని క్యాప్షన్‌ ఇవ్వగా నెటిజెన్స్ బాగా స్పందిస్తున్నారు. సాయిపల్లవి షేర్‌ చేసిన ఫొటోలు చూసి సమంత, అనుపమతో పాటు పలువురు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. 'సో క్యూట్‌' అని సమంత స్పందించగా.. 'నువ్వు మంచి మనస్సున్న డార్లింగ్‌' అంటూ అనుపమ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి విరాట పర్వం, లవ్ స్టోరీ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. విరాట పర్వంలో రానా హీరోగా నటిస్తుండగా, లవ్ స్టోరీ మూవీలో నాగ చైతన్య చేస్తున్నారు. శేఖర్ కమ్ముల తెరక్కిస్తున్న లవ్ స్టోరీ మూవీపై భారీ అంచనాలున్నాయి. గతంలో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన భారీ విజయం సాధించిన నేపథ్యంలో లవ్ స్టోరీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది.