ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. జనాలకు కూడా వీటిపై ఆసక్తి పెరిగిపోతోంది. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ తరహా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ ని రూపొందించడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. 

ఇప్పటికే తమిళంలో 'ది ఐరెన్ లేడీ' అనే పేరుతో బయోపిక్ ని మొదలుపెట్టారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ కనిపించనుంది. ఇది ఇలా ఉండగా.. దర్శకుడు ఏ.ఎల్.విజయ్.. జయలలితపై మరో బయోపిక్ తీయాలని భావిస్తున్నారు.

ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని ఎంపిక చేసుకున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు కోలివుడ్ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీని గురించి చిత్రబృందం నుండి అధికార ప్రకటన రావాల్సివుంది.

ప్రస్తుతం హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సాయి పల్లవి ఇప్పుడు శశికళ లాంటి పాత్రకు సై అంటుందా..? అనేది ప్రశ్నగా మారింది. ఇటీవల సాయి పల్లవి నటించిన 'పడి పడి లేచే మనసు', 'మారి2' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.