శర్వానంద్, సాయిపల్లవిల రొమాన్స్ కు రంగం సిద్ధం

sai pallavi to pair with sharwanand in hanu raghavapudi
Highlights

  • శర్వానంద్, సాయిపల్లవి కాంబినేషన్ లో మూవీ
  • హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం
  • వచ్చే మాన్ సూన్ లో ఈ రొమాంటిక్ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్స్

టాలీవుడ్ హీరో శర్వానంద్ 2017 సంవత్సరంలో శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఇక 'ఫిదా', 'ఎంసీఏ' సినిమాలతో సూపర్ హిట్ జర్నీ ప్రారంభించిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజీయే. కదా.. అదే ఖరారైంది.

 

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బేనర్లో సుధాకర్ చెరుకూరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మేరకు గురువారం ఈ సంస్థ నుండి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి', ‘కృష్ణగాడి వీరప్రేమగాథ', ‘లై' చిత్రాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నారు.

 

దర్శకుడు హను రాఘవపూడి రొమాంటిక్ అవ్ స్టోరీలు తెరకెక్కించడంలో ఎక్స్‌ పర్ట్. శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కించే చిత్రాన్ని వినోదాత్మక ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం షూటింగ్ జనవరి 3వ వారం నుంచి ప్లాన్ చేస్తున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ... ముగ్గురు టాలెంటెడ్ స్టార్లతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. తెలుగులో ఇదో హంచి హిల్లేరియస్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా నిలుస్తుంది. జనవరి మూడో వారంలో షూటింగ్ మొదలు పెట్టి, వచ్చే వర్షాకాలం నాఠికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

loader