హీరో హీరోయిన్ కాంబినేషన్ ఒక్కసారి సెట్ అయితే వారి నుంచి మరో సినిమా వస్తే బావుంటుందని ఆడియెన్స్ అంచనాలు పెంచుకోవడం కామన్. ఇక మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'పడి పడి లేచే మనసు' అనే సినిమా చూసిన తరువాత కూడా అందరూ అదే ఉహించుకుంటారని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. 

రొమాంటిక్ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ - సాయి పల్లవి జంట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని టాక్ వస్తోంది. తెరపై నిజమైన లవర్స్ అని అందరి మనస్సులో ఒక భావనని కలిగిస్తారట. ఇప్పటికే టైటిల్ సాంగ్ సినిమాకు మంచి క్రేజ్ ను తీసుకురాగా పోస్టర్స్ కూడా సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. ఇక నేడు మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. కల్లోలం అనే ఈ పాట కూడా లిరిక్స్ తో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. 

విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. సినిమాలో సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ఇక సినిమాపై మొత్తంగా చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉందని హీరో హీరోయిన్ కాంబినేషన్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటున్నారు. తప్పకుండా ఊహించని సక్సెస్ అందుకుంటారని సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రసాద్ - సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.