సాయి పల్లవి క్రేజ్ ఏమిటో ఒకే ఒక్క పాటతో పూర్తిగా అర్థమైపోయింది. ధనుష్ తో చిందులేసిన సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ ఇప్పటికే 400 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది. చూస్తుండగానే రోజురోజుకు పాటకు వ్యూస్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతానికి ప్రభుదేవా  కొరియోగ్రఫీ సూపర్బ్. 

సాయి పల్లవి - ధనుష్ ల ఎనర్జీ కరెక్ట్ గా సాంగ్ లో కనిపించడంతో అదే ఫ్లో లో సాంగ్ సంచలనం సృష్టించింది. ఇక బాలీవుడ్ సాంగ్స్ కి కూడా ఈ సాంగ్ ఎసరుపెట్టేలా ఉందని అర్ధమవుతోంది. బాలీవుడ్ లో టెన్  సాంగ్స్ మాత్రమే టాప్ లో ఉన్నాయి. అన్ని కూడా 500 మిలియన్ వ్యూవ్స్ + తో ఉన్నాయ్. అయితే ఆ సాంగ్స్ రిలీజయ్యి ఏళ్ళు గడుస్తోంది. 

ఇప్పుడు రౌడీ బేబీ ఆ సాంగ్స్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఫస్ట్ సౌత్ సాంగ్ గా చరిత్ర సృష్టించబోతోందని చెప్పవచ్చు. మరో 100 మిలియన్ల వ్యూవ్స్ వస్తే ఇండియన్ టాప్ సాంగ్స్ లో సాయి పల్లవి సాంగ్ కూడా ఉంటుంది. మరి ఈ రికార్డ్ కి ఎంత సమయం పడుతుందో చూడాలి.