పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మరో కొత్త సినిమాని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అయితే కొత్తగా ప్రకటించిన సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందే మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. దీనికి `బిల్లా రంగా` అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు టాక్‌.

ఇందులో రానా మరో హీరోగా నటిస్తారని అన్నారు. కానీ నితిన్‌ మరో హీరోగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సర్‌ప్రైజింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. పవన్‌ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సిందే. ఇదే నిజమైతే సాయిపల్లవికి ఓ బిగ్‌ ఆఫర్‌ తగిలినట్టే అని చెప్పొచ్చు. ప్రస్తుతం పవన్‌ `వకీల్‌సాబ్‌`తోపాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హారీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.