తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకున్న వ్యక్తిని సాయి పల్లవి 
పెళ్లి చేసుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వార్తలపై సాయి పల్లవి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తన పెళ్లిపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. దర్శకుడు విజయ్ కూడా సాయి పల్లవితో పెళ్లి వార్తలు నిజం కావని తేల్చేశారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని పట్టించుకోని సాయి పల్లవి ఈసారి మాత్రం సీరియస్ గా తీసుకుంది.

పాపులారిటీవచ్చినప్పటి నుండి తనపై రకరకాల వదంతులు పుట్టిస్తూనే ఉన్నారని, ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని, ఇకనైనా వదంతులు కట్టిపెట్టాలని ఆమె ఘాటుగా స్పందించింది.

గతేడాది విడుదలైన 'కణం' చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని విజయ్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య  ప్రేమ కలిగిందని, అది పెళ్లి వరకు వెళ్లిందని కోలివుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.