ప్రస్తుతం ఉన్న హీరోయిన్లతో పోలిస్తే నటి సాయిపల్లవి మాత్రం కాస్త ప్రత్యేకమైన చెప్పాలి. తన నటనతో తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. తెరపై నేచురల్ గా కనిపిస్తూ.. తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాల్లో మంచి అవకాశాలే వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. ఈ మధ్య కాలంలో చాలా మంది నటీనటులు సినిమాలతో పాటు ప్రకటనల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. మహా అయితే ఒకరోజు షూటింగ్.. కానీ రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ఇస్తారు. దీంతో యాడ్ లో నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోవడం లేదు.

కానీ నటి సాయి పల్లవి మాత్రం రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని వచ్చిన ఓ కంపనీ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ప్రముఖ ఉత్పత్తుల సంస్థ వారు తమ ఫేస్ క్రీమ్ ప్రకటనలో నటిస్తే.. రూ.2 కోట్లు ఇస్తామని భారీ ఆఫర్ చేశారట.

కానీ అందుకు ఆమె తిరస్కరించడమే కాకుండా ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్న తను ఇలాంటి ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తానని అనుకున్నారంటూ ప్రశ్నించిందట. మేకప్ లేకుండానే మా ప్రకటనలో కనిపించండని సదరు సంస్థ సూచించినప్పటికీ నో అని చెప్పేసిందట సాయిపల్లవి.